AP Ration Cards : కొత్త రేషన్ కార్డులపై అలర్ట్-రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరణ, ఇంకా ఆప్షన్ ఇవ్వలేదంటున్న ఉద్యోగులు-ap new ration cards application start from dec 2nd onwards sachivalayam employee says no option came ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Cards : కొత్త రేషన్ కార్డులపై అలర్ట్-రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరణ, ఇంకా ఆప్షన్ ఇవ్వలేదంటున్న ఉద్యోగులు

AP Ration Cards : కొత్త రేషన్ కార్డులపై అలర్ట్-రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరణ, ఇంకా ఆప్షన్ ఇవ్వలేదంటున్న ఉద్యోగులు

Bandaru Satyaprasad HT Telugu
Dec 02, 2024 08:26 AM IST

AP Ration Cards : మరో కీలక హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రేపటి నుంచి కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని ఇటీవల ప్రభుత్వం తెలిపింది. అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఏ ఆప్షన్ విడుదల కాలేదని ఉద్యోగులు అంటున్నారు.

త్త రేషన్ కార్డులపై అలర్ట్-రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరణ, ఇంకా ఆప్షన్ ఇవ్వలేంటున్న ఉద్యోగులు
త్త రేషన్ కార్డులపై అలర్ట్-రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరణ, ఇంకా ఆప్షన్ ఇవ్వలేంటున్న ఉద్యోగులు

ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది. అధికారంలో రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ హామీ మేరకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కొత్త రేషన్‌ కార్డుల ప్రక్రియ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇటీవల ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

yearly horoscope entry point

ఇంకా ఆప్షన్ రాలేదు-సచివాలయాలు

అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందనే ప్రచారంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. గ్రామ, వార్డు సచివాలయాలల్లో రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనత చెందవద్దని కోరారు. యూట్యూబ్, వాట్సాప్ లో వచ్చే పుకార్లను నమ్మవొద్దన్నారు

డిసెంబర్ 2 నుంచి 28 వరకు

ఎన్నికల ప్రక్రియ కారణంగా నిలిచిపోయిన కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నారు. రేషన్ కార్డుల జారీ కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. కనీసం మార్పులు, చేర్పులకూ అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డు జారీపై కీలక అడుగులు వేస్తోంది. డిసెంబరు 2వ తేదీ నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబరు 28 వరకు వచ్చిన దరఖాస్తులు వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో కొత్త కార్డులు తేయనున్నారు.

రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులు

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు, కొత్తగా పెళ్లైన వారిని కార్డుల నుంచి తొలగేందుకు, చిరునామా మార్పు, ఆధార్‌ నంబరు అనుసంధానం, వంటి ఏడు రకాల సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. గతంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నాటికి కార్డులు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు.. పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు సంబంధించి.. విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు అంశంపై ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. లబ్దిదారులకు మంజూరు చేసే.. కార్డు రంగుతోపాటు దానిపై ముద్రించే చిహ్నాలను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు వివరించారు. రాష్ట్రం సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు కీలక ప్రామాణికంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వారి వివరాలను పరిశీలించి అనర్హులగా గుర్తించనుంది. వారి రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం