Thailand Tour: రూ.40వేల ఖర్చుతోనే 5 రోజులు బ్యాంకాక్, పటాయా టూర్ వెళ్లొచ్చు.. ఈ ఇయర్ ఎండ్‍కు ప్లాన్ చేయండి: వివరాలివే-thailand tour plan you can go trip for bangkok and pattayya in 40000 from hyderabad know the budget ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thailand Tour: రూ.40వేల ఖర్చుతోనే 5 రోజులు బ్యాంకాక్, పటాయా టూర్ వెళ్లొచ్చు.. ఈ ఇయర్ ఎండ్‍కు ప్లాన్ చేయండి: వివరాలివే

Thailand Tour: రూ.40వేల ఖర్చుతోనే 5 రోజులు బ్యాంకాక్, పటాయా టూర్ వెళ్లొచ్చు.. ఈ ఇయర్ ఎండ్‍కు ప్లాన్ చేయండి: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 19, 2024 04:30 PM IST

Thailand Tour: ఈ ఏడాది సంవత్సరం చివర్లో వెకేషన్ వెళ్లాలనుకుంటే థాయ్‍లాండ్ వెళ్లొచ్చు. సరైన ప్లాన్ చేసుకుంటే రూ.40వేలలోపు ఖర్చుతోనే ఐదు రోజులు బ్యాంకాక్, పటాయా ట్రిప్ వేయవచ్చు. బడ్జెట్ ఎలా అవుతుందో ఇక్కడ తెలుసుకోండి.

Thailand Tour: రూ.40వేల ఖర్చుతోనే 5 రోజులు బ్యాంకాక్, పటాయా టూర్ వెళ్లొచ్చు.. ఈ ఇయర్ ఎండ్‍కు ప్లాన్ చేయండి: వివరాలివే
Thailand Tour: రూ.40వేల ఖర్చుతోనే 5 రోజులు బ్యాంకాక్, పటాయా టూర్ వెళ్లొచ్చు.. ఈ ఇయర్ ఎండ్‍కు ప్లాన్ చేయండి: వివరాలివే

వచ్చే నెల డిసెంబర్‌తో 2024 సంవత్సరం ముగినుంది. ఇయర్ ఎండ్‍లో వెకేషన్ వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. ఇండియాలో కాకుండా ఫారిన్ ట్రిప్‍కు వెళ్లాలనుకునే వారికి థాయ్‍లాండ్ మంచి టూరింగ్ ప్లేస్‍గా ఉంది. థాయ్‍లాండ్ వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. పాస్‍పోర్ట్ ఉంటే సరిపోతుంది. థాయ్‍లాండ్‍లో విమానం దిగాక టూరిస్ట్ వీసా తీసుకోవచ్చు. థాయ్‍లాండ్‍లో ముఖ్యంగా చూడాల్సింది రాజధాని బ్యాంకాక్, పటాయా. పర్యాటక ఆకర్షణ ఈ సిటీల్లో ఉంటుంది. బీచ్‍లు, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, మసాజ్‍లు, భారీ షాపింగ్ మాల్స్, జూలు, వాకింగ్ స్ట్రీట్స్ ఇలా చాలా ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఒక్కరు రూ.40లోపు బడ్జెట్‍లోనే ఈ ట్రిప్ పూర్తి చేయవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫ్లైట్ టికెట్స్ ఇలా..

హైదరాబాద్ నుంచి థాయ్‍లాండ్ రాజధాని బ్యాంకాక్‍కు విమానం టికెట్లు బుక్ చేసుకోవాలి. డిసెంబర్ కోసం ఇప్పుడే బుక్ చేసుకుంటే మంచి ధరకు కొనుక్కోవచ్చు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‍కు విమాన టికెట్ ధరలు డిసెంబర్‌లో కొన్ని రోజుల్లో ప్రస్తుతం రూ.10వేల లోపు ధరతోనూ కూడా చూపిస్తున్నాయి. రూ.10వేల నుంచి రూ.12వేల మధ్య ధరతో టికెట్ తీసుకోవచ్చు. రిటర్న్ టికెట్ కూడా ఇదే రేంజ్‍లో ఉంటుంది. లగేజ్ ఎక్కువగా తీసుకెళితే దానికి కూడా చార్జెస్ ఉంటాయి. అందుకే విమానంలో ఉచితంగా తీసుకెళ్లంత లగేజ్ ఉంటే ఖర్చులు తగ్గుతాయి.

అకాడమిడేషన్, ట్రావెల్ ఇలా..

బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో దిగాక వీసా అప్లై చేసి తీసుకోవచ్చు. అవసరం అనుకుంటే సిమ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. హోటల్ రూమ్‍ లేదా హాస్టల్ బ్యాంకాక్ బదులు పటాయాలో తీసుకుంటే తక్కువ ధర ఉంటాయి. బ్యాంకాక్, పటాయా మధ్య దూరం సుమారు 150కిలోమీటర్లుగా ఉంటుంది. పటాయాలో రోజుకు రూమ్ బడ్జెట్‍లో అనుకుంటే రూ.1,400 నుంచి ఉంటాయి. తక్కువ ఖర్చు చేయాలంటే హాస్టళ్లు ఉంటాయి. వీటిలో రోజుకు రూ.700 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు రోజులకు గాను ఉండేందుకు హోటల్ రూమ్ అయితే సుమారు రూ.6వేల వరకు అవుతుంది. మరో రోజు చెకౌట్ చేసి లగేజ్ కోసం లాకర్ తీసుకొని విహరించవచ్చు. 

థాయ్‍లాండ్‍లో బస్‍లు సహా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బాగుంటుంది. ధరలు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడుకుంటే తక్కువ ఖర్చులోనే సాగిపోతుంది. బ్యాంకాక్, పటాయా మధ్య సుమారు మూడు గంటల్లోనే ప్రయాణించవచ్చు. బ్యాంకాక్, పటాయాలో ఒకటి చోటి నుంచి ఒక చోటుకి వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనుకూలంగా ఉంటుంది. పర్యాటక ప్రాంతాల మధ్య ఇలా తిరిగితేనే బెస్ట్. రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉంటాయి. క్రూజ్‍లోనూ ఓ రోజు సరదాగా విహరించే ప్లాన్ చేయవచ్చు.

బ్యాంకాక్, పటాయాలో స్ట్రీట్ ఫుడ్ ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ తింటే ఖర్చులు తగ్గించుకోవచ్చు. తక్కువ ధరలకే ఫుడ్ దొరికే కొన్ని రెస్టారెంట్లు కూడా ఉంటాయి. మొత్తంగా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్, పటాయా ట్రిప్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఒకరికి రూ.40వేలల్లోనే పూర్తి చేసేయవచ్చు. అయితే, డిసెంబర్ కోసం ఇప్పుడే బుకింగ్స్ చేసుకుంటే బడ్జెట్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చివర్లో అంటే విమానం రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. షాపింగ్ చేయాలనుకుంటే అదనపు బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి.

పకెట్ వెళ్లాలంటే..

థాయ్‍లాండ్‍లో పకెట్ కూడా చాలా పాపులర్ సిటీ. ఈ సిటీలో బీచ్‍లు బాగా ఫేమస్. సముద్ర తీరాన్ని ఇష్టపడే వారికి పకెట్ చాలా సూటవుతుంది. పర్యాటక ప్రాంతాలు, స్పెషల్ అట్రాక్షన్లు కూడా ఎక్కువే. అయితే, బ్యాంకాక్ నుంచి పకెట్ సుమారు 850 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ కాస్త ఎక్కువ ఖర్చు పెట్టగలమనుకుంటే థాయ్‍లాండ్ ట్రిప్‍లో పకెడ్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది.

Whats_app_banner