తెలుగు న్యూస్ / ఫోటో /
Vizag Bangkok Flight : ఇక నేరుగా బ్యాంకాక్ వెళ్లొచ్చు! విశాఖ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం, పూర్తి వివరాలివే
- Bangkok-Vizag AirAsia Flight 2024: విశాఖ నుంచి మరో ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. డైరెక్ట్ గా బ్యాంకాక్ వెళ్లేలా ఎయిర్ ఏషియా సరికొత్త సేవలను ప్రారంభించింది. ఏప్రిల్ 9వ తేదీన ఈ సర్వీసులు స్టార్ట్ కాగా...వారానికి 3 రోజులు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి...

(1 / 6)
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎయిర్ ఎషియా. ఇక నుంచి విశాఖపట్నం నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లే సేవలను ప్రారంభించింది. ఈ మేరకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.(Photo Source From Fly AirAsia FB)
(2 / 6)
ఈ సర్వీస్ ను ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభించింది. మంగళవారం విశాఖ నుంచి ఫ్లైట్ బయలుదేరే తొలిసర్వీస్ ప్రయాణికులకు పుష్ప గుచ్చాలు ఇచ్చి వీడ్కోలు పలికింది ఏయర్ ట్రావెల్స్ అసోసియేషన్.
(3 / 6)
ప్రతి మంగళ, గురు, శని వారాల్లో బ్యాంకాక్ నుంచి ఫ్లైట్ రాత్రి 10.05 కి బయల్దేరి విశాఖకు 11.20 కి చేరుకుంటుంది. కేవలం గంటా 25 నిమిషాల్లో వైజాగ్ కు రావొచ్చు.(Photo Source From Fly AirAsia FB)
(4 / 6)
తిరిగి రాత్రి 11.50 కి విశాఖ నుంచి బయల్దేరి వెళ్తుంది ఎయిర్ ఏషియా ఫ్లైట్..ఇది రాత్రి 2.30 గంటలకు బ్యాంకాక్‌లో ల్యాండ్ అవుతుంది. అక్కడ రాత్రి 7.50 గంటలకు బయలుదేరే విమానం విశాఖపట్నంలో అదేరోజు రాత్రి 11.20 గంటలకు చేరుతుందని ఎయిర్ ఎసియా ప్రతినిధులు వివరించారు. ఈ ప్రయాణానికి 2.40 గంటల సమయం పడుతుంది. (Photo Source From Fly AirAsia FB)
(5 / 6)
విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు మరో విమాన సర్వీసును ప్రారంభించబోతుంది ఎయిర్ ఏషియా. ఈ సర్వీసును ఏప్రిల్ 26వ తేదీన ప్రారంభించనుంది. ఇప్పటికే బుకింగ్ లను ప్రారంభించింది.(Photo Source From Fly AirAsia Twitter)
ఇతర గ్యాలరీలు