ఈ నెలలో 'గోవా' ట్రిప్ ప్లాన్ ఉందా..? బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ఇదే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Aug 07, 2024
Hindustan Times Telugu
ఐఆర్‌సీటీసీ టూరిజం 'GOAN DELIGHT' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది.
image credit to unsplash
గోవా టూర్ ప్యాకేజీ ఆగస్టు 23, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.
image credit to unsplash
3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ తేదీలో వెళ్లటం కుదరకపోతే సెప్టెంబర్ మాసంలో కూడా గోవా వెళ్లొచ్చు.
image credit to unsplash
తొలిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 11 తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. ఈ ట్రిప్ లో భాగంగా wax world Museum, మంగేషి ఆలయం, Miramar Beachకు వెళ్తారు. మండోవి నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది.
image credit to unsplash
హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే సింగిల్ అక్యుపెన్సీకి రూ. 24620గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19245, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 18935గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి.
image credit to unsplash
సమ్మర్ పూర్తి అయిన తర్వాత గోవా ట్రిప్ ప్యాకేజీ ధరలు తగ్గాయి.
image credit to unsplash
హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వవరాలను తెలుసుకోవచ్చు.