ఆ ఫ్యాక్టరీ మాకొద్దు.. ఖబర్దార్! Farmers protesting against ethanol factory in Dilawarpur
- నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల వద్దకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. అయితే తమకు ఫ్యాక్టరీ వద్దని ఆమెను ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు. 128 రోజులుగా చేస్తున్న తమ ఉద్యమానికి మద్దతు తెలిపిన విజయ్ కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడును సస్పెండ్ చేయగా అయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించమని రైతులు భీష్మించుకుని ఉండగా వెళ్లిపోవాలని ప్రయత్నించిన ఆర్డీవో రత్న కళ్యాణిని అడ్డుకున్నారు.