World's oldest man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత; దీర్ఘాయువు కోసం ఆయన చెప్పిన సింపుల్ టిప్స్ ఇవే..
World's oldest man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా రికార్డు సృష్టించిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 112 ఏళ్లు. ప్రఖ్యాత నౌక టైటానిక్ నీట మునిగిన కొన్ని నెలల తర్వాత టిన్నిస్ వుడ్ జన్మించాడు. అతను రెండు ప్రపంచ యుద్ధాలను చూశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు.
World's oldest man Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా రికార్డు సృష్టించిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ ఇంగ్లండ్ లో సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 112 సంవత్సరాలు. మూడు నెలల క్రితమే ఆయన 112వ జన్మదినం జరుపుకున్నారు.
1912 ఆగస్టు 26
1912 ఆగస్టు 26న వాయవ్య ఇంగ్లాండ్ లో లివర్ పూల్ లో టిన్నిస్ వుడ్ జన్మించారు. 2024 నవంబర్ 25న అదే లివర్ పూల్ సమీపంలోని ఒక సంరక్షణ గృహంలో ఆయన మరణించారు. తన దీర్ఘాయువుకు కారణం కేవలం అదృష్టమేనని టిన్నిస్ వుడ్ గతంలో చెప్పారు. 2024 ఏప్రిల్ నెలలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు అతడికి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గుర్తించి, ధ్రువీకరణ పత్రం అందించారు. ఆ సందర్భంగా టిన్నిస్ వుడ్ మాట్లాడుతూ, ఎక్కువ కాలం జీవించడం లేదా తక్కువ కాలం జీవించడం అనేది మన చేతిలో లేదని వ్యాఖ్యానించారు.‘‘ అయితే, ఆరోగ్యకరమైన జీవితానికి సంయమనం కీలకమని ఆయన అన్నారు. టిన్నిస్ వుడ్ ఎప్పుడూ ధూమపానం చేయలేదు. అరుదుగా మద్యం సేవించేవాడు. ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్ తినడం మినహా ప్రత్యేకమైన ఆహారాన్ని అనుసరించలేదు. బ్రిటష్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన తరువాత ఆయన అకౌంటెంట్ గా పని చేశారు. టిన్నిస్ వుడ్ కు ప్రస్తుతం ముత్తాత హోదా కూడా ఉంది.
అతి మంచిది కాదు..
‘‘మీరు ఎక్కువగా తాగితే లేదా మీరు ఎక్కువగా తింటుంటే లేదా మీరు ఎక్కువగా నడిచినట్లయితే - మీరు ఏదైనా ఎక్కువగా చేస్తే - మీరు చివరికి బాధపడతారు" అని టిన్నీస్ వుడ్ చెప్పారు. టైటానిక్ మునిగిన కొన్ని నెలల తర్వాత టిన్నిస్ వుడ్ జన్మించాడు. అతను రెండు ప్రపంచ యుద్ధాలను చూశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీ పే కార్ప్స్ లో పనిచేశాడు. వెనిజులాకు చెందిన జువాన్ విసెంటే పెరెజ్ 114 ఏళ్ల వయసులో మరణించడంతో, ఆయన అనంతరం టిన్నీస్ వుడ్ ప్రపంచంలో అత్యంత వృద్ధుడి ఘనత సాధించాడు. ఆయనకు కుమార్తె సుసాన్, నలుగురు మనవరాళ్లు, ముగ్గురు మనుమలు ఉన్నారు. 44 ఏళ్ల వయస్సులో ఆయన భార్య బ్లోడ్వెన్ 1986లో మరణించారు. కాగా, జపాన్ కు చెందిన 116 ఏళ్ల టోమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు సృష్టించారు.