నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఎందుకంటే ఇది పెప్సిన్, ప్రొటీన్-బ్రేకింగ్ ఎంజైమ్‌ను సక్రియం చేస్తుంది.
Unsplash
By Anand Sai Nov 21, 2023
Hindustan Times Telugu
లెమన్ వాటర్ తాగడం వల్ల డీహైడ్రేషన్ కూడా వస్తుంది. మీరు నిమ్మకాయ నీటిని తాగినప్పుడు, అది మూత్రం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అనేక ఎలక్ట్రోలైట్లు, సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా విసర్జించబడతాయి.
Unsplash
లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం లోపం ఏర్పడుతుంది.
Unsplash
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రక్తంలో ఐరన్ స్థాయి పెరుగుతుంది. ఇది ప్రమాదకరమైనది, మీ అంతర్గత అవయవాలను దెబ్బతీస్తుంది.
Unsplash
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా ఆక్సలేట్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
Unsplash
లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలో అసిడిటీ ఉంటుంది, దీని వల్ల ఎముకలపై చెడు ప్రభావం చూపుతుంది.
Unsplash
లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. నిమ్మకాయలో అధిక మొత్తంలో యాసిడ్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది.
Unsplash
మీకు టాన్సిల్ సమస్య ఉంటే లెమన్ వాటర్ తాగకండి. ఎందుకంటే లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు నొప్పి వస్తుంది.