తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Wayanad Tour : 'వండర్స్ ఆఫ్ వయనాడ్' ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, వివరాలివే
- IRCTC Hyderabad Wayanad Tour : మంచు కురిసే వేళలో కేరళలోని వయనాడ్ అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం డిసెంబర్ 3, 2024వ తేదీన అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
- IRCTC Hyderabad Wayanad Tour : మంచు కురిసే వేళలో కేరళలోని వయనాడ్ అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం డిసెంబర్ 3, 2024వ తేదీన అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
(1 / 7)
కేరళ అందాలను మాటల్లో వర్ణించలేం. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలను చూసి అస్వాదించాల్సిందే. అయితే వయనాడ్‌లోని పలు ప్రదేశాలను చూసేందుకు IRCTC టూరిజం ప్యాకేజీ ప్రకటించింది.(image source unsplash.com)
(2 / 7)
'WONDERS OF WAYANAD (SHR098)' పేరుతో హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 5 రోజులు ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ డిసెంబర్ 3, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో బుకింగ్ చేసుకోవచ్చు.(image source unsplash.com)
(3 / 7)
టూర్ షెడ్యూల్ చూస్తే తొలి రోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి జర్నీ ఉంటుంది. కాచిగూడ - మంగుళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం 12789) ఎక్కాలి. రాత్రి అంతా జర్నీ ఉంటుంది. ఇక రెండో రోజు ఉదయం 6.17 నిమిషాలకు కన్నూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పిక్ చేసుకుని ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. సెయింట్ ఏంజెలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియంను సందర్శిస్తారు. అక్కడి నుంచి వయనాడ్‌కు ప్రయాణం ఉంటుంది. రాత్రి కాల్పెట్టలో హోటల్లో చెకిన్ అవుతారు. (image source unsplash.com)
(4 / 7)
3వ రోజు మార్నింగ్ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత కుర్వాదీప్లోని పలు ప్రాంతాలను విజిట్ చేస్తారు. తిరునెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రికీ కాల్పెట్టలోనే బస చేస్తారు. ఇక 4వ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సును విజిట్ చేస్తారు. ఆ రోజు రాత్రి Kalpettaలోనే బస చేయాలి.(image source unsplash.com)
(5 / 7)
5వ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడినుంచి కొజికోడ్కు చేరుకుంటారు. కప్పడ్ బీచ్‌ను సందర్శిస్తారు. సాయంత్రం SM స్ట్రీట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి కాలికట్ రైల్వ్స్టేషన్లో డ్రాప్ చేస్తారు. ఆ రాత్రి 11.35కి మంగుళూరు సెంట్రల్ - కాచిగూడ(ట్రైన్ నెం 12790) ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది. 6వ రోజు రాత్రి 11. 40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(image source unsplash.com)
(6 / 7)
హైదరాబాద్ - వయనాడ్ ట్రిప్ ధరలు : సింగిల్ షేరింగ్ రూ.36,590, డబుల్ షేరింగ్ రూ.20,700గా ఉంది. ట్రిపుల్ షేరింగ్ రూ.16,280గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫర్ట్(3AC) క్లాస్ లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ రూ.13,490గా నిర్ణయంచారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు వేర్వురు ధరలున్నాయి.(image source unsplash.com)
ఇతర గ్యాలరీలు