Guru Pradosha Vratham: రేపే గురు ప్రదోష వ్రతం: శుభ ముహూర్తం, పూజా విధానం గురించి తెలుసుకుందాం
Guru pradosha vratham: హిందూ మతంలో గురు ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివుడిని ధార్మిక ఆచారాలతో పూజిస్తారు. 28 నవంబర్ గురువారం రోజు ఈ మాసంలో వచ్చే చివరి ప్రదోష తిథి కనుక ఈ రోజు ఏమేం చేయాలో తెలుసుకోండి.
ప్రతి నెలా కృష్ణ పక్షం, శుక్లపక్షాల త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. నవంబర్ 28న గురు ప్రదోష వ్రత తిథి వచ్చింది. నవంబర్ నెలలో ఇదే చివరి ప్రదోష ఉపవాసం కూడా. హిందూ సంప్రదాయాల ప్రకారం.. ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివపార్వతులను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావని చాలా మంది నమ్ముతారు. గురు ప్రదోష వత్రం రోజున ఉపవాసం దీక్ష చేపడట్టడం వల్ల శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం కలుగుతాయని, ముఖ్యంగా సంతానం లేని వారికి ఈ రోజున చేసే పూజలకు తప్పకుండా ఫలితం కనిపిస్తుందని భక్తుల నమ్మిక. గురు ప్రదోష వ్రతం శుభముహర్తం, ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
గురుప్రదోష వ్రతం రోజున కలిగే శుభ యోగాలు:
నవంబర్ నెలలో వచ్చే చివరి ప్రదోష ఉపవాసంలో అలాగే ఈ రోజున శుభయెగాలు ఏర్పడుతున్నందున ఈ రోజుకు ప్రాముఖ్యత ఎక్కువ. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 04:02 గంటల వరకు సౌభాగ్య యోగం ఉంది. ఆ తరువాత శోభన యోగం ప్రారంభమవుతుంది. జ్యోతిషశాస్త్రంలో శోభన యోగం, సౌభాగ్య యోగాలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ యోగాలలో చేసే పని కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్ముతారు.
గురు ప్రదోష వ్రతం రోజున శుభ ముహూర్తం:
హిందూ క్యాలెండర్ ప్రకారం త్రయోదశి తిథి 28 నవంబర్ 2024 ఉదయం 06:23 గంటలకు ప్రారంభమై, 29 నవంబర్ 2024 ఉదయం 08:39 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున శివుడిని పూజించడానికి ఉత్తమ సమయం సాయంత్రం 05.23 నుండి 08.05 వరకు ఉంటుంది. మొత్తం పూజ సమయం 02 గంటల 42 నిమిషాలు.
ప్రదోష వ్రత పూజ యొక్క ఉదయం మరియు సాయంత్రం కొన్ని శుభ ఘడియలున్నాయి. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు.
గురు ప్రదోష వ్రతం రోజు శుభ ముహూర్తం?
చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 28 202నన గురు ప్రదోష వ్రతానికి శుభదినం.
ముహూర్తం:
త్రయోదశి తిథి ప్రారంభం - నవంబర్ 28, 2024 సాయంత్రం 06:23 గంటలకు
త్రయోదశి తిథి ముగుస్తుంది - నవంబర్ 29, 2024 ఉదయం 08:39 ప్రదోష
పూజ ముహూర్తం - 17:24 నుండి 20:06
వ్యవధి - 02 గంటలు 42 నిమిషాల
ప్రదోష సమయం - 17:24 నుండి 20:06
ప్రదోష వ్రతం 2023 పూజ విధానం:
ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. పార్వతీ సమేత పరమశివుడిని కుటుంబంలోని అన్ని దేవుళ్లను పూజించాలి. ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు, పూలు, అక్షింతలతో ఉపవాస దీక్షను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయండి. ఆ రోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. శివాలయం లేదా ఇంటిలో శివుని ప్రతిష్ఠను నిర్వహించి, శివ కుటుంబాన్ని పూజించండి. గురు ప్రదోష వ్రతం కథను వినండి. అనంతరం నెయ్యి దీపంతో శివుడికి హారతి నిచ్చి భక్తిశ్రద్ధలతో ఆయన్ని పూజించాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. చివరగా పాపాలను తొలగించమని, పొరపాట్లను క్షమించమని శివుడిని వేడుకొండి. ఈ రోజున ప్రదోష కాలంలో చేసే పూజలకు విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే ప్రదోషకాలంలో పూజలు ప్రారంభించే ముందు మరోసారి స్నానం చేయండి. శుభముహూర్తంలో శివుని షాడోపచారాన్ని పూజించి కథను పఠించండి.
(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)