OTT Sci-Fi Movies: సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే ఇష్టమా.. ఓటీటీల్లోని ఈ సినిమాలు అస్సలు మిస్ కావద్దు
OTT Sci-Fi Movies: స్పేస్ సినిమాలంటే ఇష్టమైతే వీటిలో కొన్ని సినిమాలు తప్పక చూడాల్సిందే. ఈ ప్రతి సినిమా థ్రిల్, మిస్టరీతో నిండి ఉంటుంది. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ నాలుగు సినిమాలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.
OTT Sci-Fi Movies: సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసేవారికి మన యూనివర్స్ అందించే అసలు థ్రిల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు తీయడంలో హాలీవుడ్ తర్వాతే ఎవరైనా. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు ఈ జానర్ లో వచ్చాయి. అయితే ప్రస్తుతం ఓటీటీల్లో ఉన్న ఈ నాలుగు సినిమాలను మాాత్రం అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ మూవీస్ మనకు సైన్స్ పాఠాలు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఆ సినిమాలు ఏవి? ఏ ఓటీటీలో చూడాలన్న విషయాలను ఇక్కడ చూడండి.
ది ఇంటర్‌స్టెల్లార్ - నెట్‌ఫ్లిక్స్
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ రూపొందించిన అద్భుతం ఈ ది ఇంటర్‌స్టెల్లార్ మూవీ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మన సౌర కుటుంబం వదిలి తారాలోకంలో నివాసయోగ్యమైన గ్రహాల వేటకు వెళ్లే ఓ మాజీ నాసా సైంటిస్టు కథ ఇది.
భూమిపై మానవాళి మనుగడ ఇక కష్టం అనుకునే సమయంలో సైంటిస్టులు మరో గ్రహం వేటలో పడతారు. ఈ మూవీ మనల్ని నిజంగా ఓ సరికొత్త లోకం తీసుకెళ్తుంది. విశ్వం అంతుచిక్కని రహస్యాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. ఈ మూవీకి పలు విభాగాల్లో ఆస్కార్స్ కూడా లభించాయి.
ది మూన్ - ప్రైమ్ వీడియో
స్పేస్ లోకి వెళ్లిన ఓ వ్యోమగామి అక్కడే చిక్కుకుంటే ఏమవుతుంది? ఈ ది మూన్ మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ కొరియన్ స్పేస్ సర్వైవల్ డ్రామా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఎంతో థ్రిల్ ను పంచుతుంది.
మొదట్లో కాస్త నెమ్మదిగా సాగినా.. తర్వాత అసలు స్పీడు అందుకుంటుంది. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా స్క్రీన్ పై నుంచి మన దృష్టిని మరల్చలేం. ఇక ఇంగ్లిష్ లోనూ ఇలాంటిదే గ్రావిటీ అనే మరో మూవీ కూడా ఉంది. అంతరిక్ష కేంద్రాన్ని బాగు చేయడానికి వెళ్లి ఉల్కల బారిన పడే కొందరు సైంటిస్టుల చుట్టూ తిరిగే కథ ఇది.
ది మార్షన్ - ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్
ది మార్షన్ 2015లో రిలీజైన సినిమా. మార్స్ (అరుణ గ్రహం)పైకి వెళ్లిన కొందరు సైంటిస్టులు తిరిగి భూమిపైకి వస్తుండగా.. ఒకరు మాత్రం అక్కడే మిస్ అవుతారు. ఆ తర్వాత అతనికి అక్కడ ఎదురయ్యే పరిస్థితులు.. అతన్ని తిరిగి భూమిపైకి తీసుకురావడానికి చేసే ప్రయత్నంతో సినిమా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఆపిల్ టీవీల్లో అందుబాటులో ఉంది.
కెప్టెన్ నోవా - నెట్‌ఫ్లిక్స్
కెప్టెన్ నోవా మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్పేస్ మూవీ ఎక్స్‌పీరియన్స్ తోపాటు మంచి టైమ్ ట్రావెల్ ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. 37 ఏళ్ల వ్యోమగామి 25 ఏళ్లు వెనక్కి వెళ్లి భూమిని అత్యంత భయంకరమైన ప్రకృతి వైపరీత్యం నుంచి కాపాడేందుకు చేసే ప్రయత్నమే ఈ కెప్టెన్ నోవా మూవీ స్టోరీ.