అయోధ్య నగరిలో భవ్య దిపోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ అయోధ్యలో దీపోత్సవ వేడుకల సందర్భంగా సృష్టించిన 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ల సర్టిఫికేట్‌లు అందుకున్నారు. 55 ఘాట్‌ల వద్ద ఏకకాలంలో 28 లక్షలకుపైగా దీపాలను వెలిగించడం ద్వారా ఈ రికార్డ్ నెలకొల్పారు. అయితే రామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేసి తర్వాత దిపోత్సవ్ వేడుకలను ప్రారంభించారు సీఎం యోగి.