TG Army Recruitment Rally : ఆర్మీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. హైదారాబాద్‌లో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డోంట్ మిస్-agniveer recruitment rally in hyderabad from december 8th to 16th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Army Recruitment Rally : ఆర్మీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. హైదారాబాద్‌లో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డోంట్ మిస్

TG Army Recruitment Rally : ఆర్మీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. హైదారాబాద్‌లో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డోంట్ మిస్

Basani Shiva Kumar HT Telugu
Nov 23, 2024 05:47 PM IST

TG Army Recruitment Rally : ఇండియన్ ఆర్మీలో చేరాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం కసరత్తు చేస్తారు. అలాంటి వారికి ఇది శుభవార్త. అవును.. త్వరలోనే హైదారాబాద్‌లో అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. దానికి సంబంధించిన ఆర్హత, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ
అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ

డిసెంబర్ 8వ తేదీ నుంచి 16 వరకు అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాల యోగి అథ్లెటిక్ స్టేడియంలో ఈ ర్యాలీ నిర్వహిచనున్నారు. తెలంగాణలో అగ్నివీరులుగా చేర్చుకొవడానికి ఇండియన్ ఆర్మీ.. ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. దాదాపు వారం రోజులు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు.

తెలంగాణలోని 33 జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులను సైన్యంలోకి అగ్నివీరులుగా చేర్చుకోనున్నారు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులు రావొచ్చు. అలాగే.. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థులు కూడా రావొచ్చు.

అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగాలకు 10వ తరగతి చదివిన వారు అర్హులు. అగ్నివీర్ ట్రేడ్స్ మెన్‌కు 8వ తరగతి ఉత్తర్ణత ఉంటే చాలు. ఈ కేటగిరీలకు హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మహిళా మిలిటరీ పోలీస్ అభ్యర్థులు.. ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం.. ర్యాలీ సైట్‌కి అన్ని డాక్యుమెంట్‌లను తీసుకురావాలని అధికారులు సూచించారు.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా అగ్నివీర్ ఉద్యోగాలు ఇప్పస్తామని చెబితే నమ్మవద్దని స్పష్టం చేశారు. మోసపూరిత ట్వీట్‌లు, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా సందేహాలు ఉంటే.. రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఫోన్ 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే.. ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

Whats_app_banner