World's oldest person | ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఇక లేరు!-worlds oldest person dies in japan at 119 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  World's Oldest Person | ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఇక లేరు!

World's oldest person | ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఇక లేరు!

HT Telugu Desk HT Telugu
Apr 25, 2022 08:17 PM IST

Kane Tanaka death | జపాన్​ మహిళ.. కేన్​ తనాకా.. 119ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. చివరి నిమిషం వరకు ఆమె యాక్టివ్​గానే ఉన్నట్టు తెలుస్తోంది.

<p>ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి</p>
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి (REUTERS)

World's oldest person | ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన జపాన్​ మహిళ.. తుదిశ్వాస విడిచారు. 119ఏళ్ల కేన్​ తనాకా.. ఈ నెల 19న మరణించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు.

yearly horoscope entry point

జపాన్​లోని నైరుతి ఫుకుయోకా ప్రాంతంలో 1903 జనవరి 2న కేన్​ తనాకా జన్మించారు. ఆమె వివిధ వ్యాపారాల్లో సత్తా చాటారు. నూడిల్స్​ సూప్​, రైస్​ కేక్​ వంటి దుకాణాలు ఆమెకు ఉండేవి. 1922లో హిడియో తనాకాను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. మరొకరిని దత్తత తీసుకున్నారు.

2019లో గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​.. ఆమెను ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తించింది. తన జీవితంలో అదే అత్యంత సంతోషకరమైన రోజు అని నాడు తనాకా వెల్లడించారు.

Kane Tanaka death | నర్సింగ్​ హోంలో ఆమె ఉండేవారు. అంత పెద్ద వయస్సులోనూ తనాకా చాలా చురుకుగా ఉండేవారు. ఉదయాన్నే 6 గంటలకు నిద్రలేచేవారు. బోర్డు గేమ్స్​ ఆడేవారు. మధ్యాహ్నం మేథమెటిక్స్​ చేస్తూ గడిపేవారు. కాలిగ్రఫీ ప్రాక్టీస్​ చేసేవారు. సోడాలు తాగేవారు, చాక్లెట్లు తినేవారు. చివరి వరకు ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా.. 2021 టోక్యో ఒలింపిక్స్​లో వీల్​ ఛైర్​పై కూర్చుని టార్చ్​ రిలేలో పాల్గొనాలని ఆమె భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అది సాధ్యపడలేదు.

జపాన్​లో వృద్ధులు ఎక్కువే..!

ప్రపంచంలో అత్యంత వృద్ధులు కలిగిన దేశంగా జపాన్​కు గుర్తింపు ఉంది. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం. 65ఏళ్లు, అంతకన్నా పైబడిన వారు 28శాతం మంది ఉంటారు!

కేన్​ తనాకా కంటే ముందు.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా జేన్​ లూయిజ్​ అనే ఫ్రెంచ్​ మహిళ ఉండేవారు. 1997లో.. 122ఏళ్ల, 164 రోజులకు ఆమె ప్రాణాలు వీడారు. ఆ తర్వాత.. ఆ స్థానం తనాకాకు దక్కింది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.