Maoists killed: చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్; ఏడుగురు మావోయిస్టులు మృతి-seven suspected maoists killed in joint operation in south abujhmad ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maoists Killed: చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్; ఏడుగురు మావోయిస్టులు మృతి

Maoists killed: చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్; ఏడుగురు మావోయిస్టులు మృతి

Sudarshan V HT Telugu
Dec 12, 2024 02:40 PM IST

Maoists killed: గురువారం తెల్లవారుజామున అబూజ్ మఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల కదలికలపై పక్కా సమాచారంతో భద్రతా దళాలు ీ సంయుక్త ఆపరేషన్ జరిపారు. మృతి చెందిన మావోల వివరాలు తెలియాల్సి ఉంది.

చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్
చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్

Maoists killed: చత్తీస్ గఢ్ లోని నారాయణ్ పూర్ జిల్లా పరిధిలోకి వచ్చే దక్షిణ అబూజ్ మఢ్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) సహా భద్రతా దళాలు గురువారం జరిపిన సంయుక్త ఆపరేషన్ లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. పక్కా ప్రణాళికతో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించామన్నారు.

గురువారం తెల్లవారుజాము నుంచి..

గురువారం తెల్లవారుజాము 3 గంటల నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతం భౌగోళికంగా చాలా సమస్యాత్మకం. దట్టమైన అడవులతో ఉంటుంది. ఇది మావోలకు కంచుకోట వంటిది. ఎన్ కౌంటర్ అనంతరం, ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ ఎన్ కౌంటర్ (encounter) కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Whats_app_banner