సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దాంట్లో పోలీసులు ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదారు. అయితే.. ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్‌పై దాడి చేస్తే కొట్టారని కొందరు అంటుంటే.. లంచం గురించి ప్రశ్నిస్తే చితకబాదారని మరికొందరు అంటున్నారు.