Bijapur Encounter : దండకారణ్యంలో భారీ ఎన్ కౌంటర్ - సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ పోలీసుల 'కూంబింగ్'-telangana police combing operation in border districts over bijapur encounter in chhattisgarh ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Police Combing Operation In Border Districts Over Bijapur Encounter In Chhattisgarh

Bijapur Encounter : దండకారణ్యంలో భారీ ఎన్ కౌంటర్ - సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ పోలీసుల 'కూంబింగ్'

HT Telugu Desk HT Telugu
Apr 03, 2024 04:54 PM IST

Bijapur Encounter Updates: బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో… తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచటంతో పాటు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ - సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ పోలీసుల 'కూంబింగ్'
బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ - సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ పోలీసుల 'కూంబింగ్'

Bijapur Encounter Updates: తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్(Bijapur Encounter) జరిగింది. 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి నిత్యావసర సరుకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలి-లేంద్ర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో బీజాపూర్ DRG, CRPF, STF, COBRA బృందాలు కూంబింగ్ చేపట్టగా ఎందురు కాల్పులు జరిగాయి. పోలీస్ బృందాలకు మావోయిస్టులకు మధ్య సుమారు ఎనిమిది గంటల పాటు ఎదురుకాల్పులు జరినట్లు సమాచారం. కాల్పుల అనంతరం పోలీసులు సెర్చ్ చేయగా ముగ్గురు మహిళలతో సహా 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. సంఘటన స్థలం నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, ఒక ఏకే 47, LMG ఆయుధం, 303 బోర్ రైఫిల్, 12 బోర్ రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, భారీ పరిమాణంలో BGL షెల్స్, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 13 మంది మావోయిస్టుల మృతదేహాలను బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. చనిపోయిన మావోలు ఎక్కువ మంది PLGA కంపెనీ నంబర్ 02 కి చెందిన వారేనని ప్రాథమికంగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

20 రోజుల్లో 24 మంది మావోలు ఎన్ కౌంటర్…

పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి బస్తర్, బీజాపూర్ , గడ్చిరోలి జిల్లాలో అలజడి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. తాజా ఘటనతో గడిచిన 20 రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో 24 మంది నక్సల్స్ మృతిచెందారు. గడ్చిరోలి జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు నక్సల్స్, బీజాపూర్ జిల్లా పిడియాగుట్టలో ఇద్దరు, బాజగూడ అడవుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఛత్తీస్ గఢ్ జరిగిన ఎన్కౌంటర్లలో 45 మంది నక్సల్స్ హతమయ్యారు. ఈ ఎన్ కౌంట్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ ఎప్రిల్ 3న బుధవారం బీజాపూర్, సుకుమా జిల్లాల బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ ను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు ఏజెన్సీల్లో తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. గంగలూరు ఠాణా పరిధిలోని గంగలూరు, లేంద్ర అడవుల్లో కోబ్రా, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి కూబింగ్ ప్రారంభించడంతో బారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.

సరిహద్దులో హై అలర్ట్…

బూటకపు ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టులు బుధవారం బీజాపూర్, సుకుమా జిల్లాల్లో బంద్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ విజయవంతం చేయడానికి మావోయిస్టులు గూడేల్లోకి వస్తే వారిని పట్టుకునేలా కూంబింగ్ ముమ్మరం చేశారు. చత్తీస్ గఢ్ వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ పోలీసులు సైతం నిఘా పెంచి సరిహద్దులో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు పార్టీకి దండకారణ్యం సేఫ్ జోన్ అయితే.. ఎండాకాలం మొదలై, అడవంతా ఆకులు రాలుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు గడ్డు పరిస్థితులు తప్పవని, గడిచిన 20 రోజుల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టుల మరణాలు అధికంగా ఉండడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Reporting - K.V.Reddy Karimnagar, HT Correspondent

IPL_Entry_Point