హిందూ సంప్రదాయాల్లో పూజలు, వత్రాలకు విశిష్ట ప్రాధ్యాన్యత ఉంటుంది. సాధన, భక్తి, శాంతికి దైవారాధనే ప్రధాన మార్గంగా భావిస్తారు. దేవుడిని పూజించడం వల్ల మనసులో శాంతి, నిగ్రహం, ఆరోగ్యం, సంతోషం, ధనవృద్ధి కలుగుతాయి. పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వ్యక్తిలోని భయం, భాదలు తొలగిపోయి ధైర్యం, విశ్వాసం కలగాలంటే ఇష్ట దైవానికి పూజ చేయడం చాలా ముఖ్యమని హిందువులు నమ్ముతారు. అయితే పూజలు చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు పాటిస్తేనే వాటి ఫలితాలు దక్కుతాయని హిందూ ఆచారాలు చెబుతున్నాయి. హిందూ ఆచారాల ప్రకారం పూజలు చేసేటప్పుడు స్త్రీలు జుట్టును విరబోసుకోకూడదు. చక్కగా జడవేసుకుని అలంకరించకుని చేసే పూజలు మాత్రమే ఫలితాయి.ఇందుకు కొన్ని ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హిందూ ఆచారాల ప్రకారం కొన్ని సమయాల్లో జుట్టు విరబోసుకోవడం అనేది శారీరక, ఆధ్యాత్మిక, సంప్రదాయ పరంగా అశుభంగా భావించబడుతుంది. వివిధ సందర్భాలలో జుట్టు విరబోసుకోవడం వలన శక్తి కోల్పోవడం, దురదృష్టం కలగడం లేదా దేవతల అనుగ్రహం కోల్పోవడం అనేది నమ్మకం.
ఆధ్యాత్మిక కోణంలో చూస్తే స్త్రీలు జుట్టు విరబోయడం అనేది భక్తిలో ఆత్మసంబంధత క్షీణించేలా చేస్తుంది. వెంట్రుకలు లేదా జడ శక్తి గ్రహణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వాటిని ముడుచుకుని లేదా అల్లుకుని జడ వేసుకోవడం వల్ల శక్తి కేంద్రీకరణ మెరుగవుతుంది. ఇది దేవతల అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది. పూజా సమయాల్లో శక్తి కేంద్రీకరణ, సామర్థ్యాన్ని పెంచుతుంది. జుట్టు విరబోసుకుని ఉండటం వల్ల ధ్యాస్య దేవుడిపై పూర్తిగా పెట్టలేరు, అసౌకర్యంగా ఉంటుంది. ఇది దేవతల పట్ల అగౌరవాన్ని, అవమానాన్ని సూచిస్తుంది. ఫలితంగా జీవితంలో శాంతి తగ్గిపోతుంది. కనుక పూజలు వ్రతాలు వంటివి చేసే సమయాల్లో చక్కగా జడవేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం, శక్తి ఉత్పత్తి అయ్యే ప్రదేశంలో అంటే ఉదాహరణకు పూజా మందిరంలో, శరీరంలోని శక్తిని కేంద్రీకరించేందుకు జుట్టును ముడి వేసుకోవడం లేదా అల్లుకుని జడ వేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది వ్యక్తి జీవితంలోకి శాంతిని, సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది. వెంట్రుకలు ప్రతికూల శక్తులకు త్వరగా ఆకర్షితం అవుతాయి. దుష్టశక్తులకు అనువుగా పనిచేస్తాయి. కనుక పూజా సమయాల్లో వెంట్రుకలను ముడి వేసుకుని ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి.