Lucky Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఆర్థిక సమస్యలే ఉండవు, జీవితాంతం కోటీశ్వరులుగానే ఉంటారు!-those born under these stars will have no financial problems and will be millionaires for life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఆర్థిక సమస్యలే ఉండవు, జీవితాంతం కోటీశ్వరులుగానే ఉంటారు!

Lucky Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఆర్థిక సమస్యలే ఉండవు, జీవితాంతం కోటీశ్వరులుగానే ఉంటారు!

Ramya Sri Marka HT Telugu
Dec 02, 2024 10:26 AM IST

Lucky Star: వాడికేంట్రా పుట్టుకతోనే కోటీశ్వరుడు చచ్చేదాకా కోటీశ్వరుడిగానే ఉంటాడు. ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు నిజంగానే జీవితాంతం కోటీశ్వరులుగా ఉంటారట. ఆ నక్షత్రాలేవో తెలుసుకుందాం.

ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కోటీశ్వరులు గానే ఉంటారు
ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కోటీశ్వరులు గానే ఉంటారు (pixabay)

పుట్టేటప్పుడు డబ్బుతో పుడతామా.. పోయేటప్పుడు డబ్బుని తీసుకని పోతామా అని అంతా అంటారు. ఇది నిజమే పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఎవరూ డబ్బుని వెంటబెట్టుకుని ఉండరు. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ డబ్బుతోనే ఉండేవారు కొందరుంటారు. వీరినే ధనవంతులు, కోటీశ్వరులు అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచీ చనిపోయే వరకూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కోటీశ్వరుడిగానే విలాసవంతమైన జీవితాన్ని గడిపుతారట.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని నక్షత్ర జన్మలు పుట్టుకతోనే కుబేర భాగ్యంతో కలుగుతాయి. ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం లోటు లేకుండా సాగిపోతుంది. కచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించిన అదృష్టవంతులు ఉండరు కూడా. పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ విధంగా చూస్తే, కుబేర భాగ్యాన్ని పొందే 6 నక్షత్రాలు ఏవో తెలుసా..

అశ్వని నక్షత్రం:

ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలోనైనా ప్రకాశిస్తారు. సాధారణంగా తెలివైన, ధైర్యం, సామర్థ్యం ఉండే వారు చిన్ననాటి నుంచే సొంతగా సంపాదించుకునే యోగాన్ని కలిగి ఉంటారు.

భరణి నక్షత్రం:

జీవితాంతం ధనవంతులుగా ఉండే రాశులలో భరణి నక్షత్రం ఒకటి. వీరి జీవితంలో ఎక్కువ స్థలాలను కొనుగోలు చేయగలరు. కష్టపడి పనిచేసే వ్యక్తులైనప్పటికీ, వీరి జన్మనక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వ్యక్తులు విలాస ప్రియులు. అందాన్ని ఆరాధించేవారు, ఆనందాన్ని కోరుకునేవారు. కళాపోషకులు కూడా.

కార్తీక నక్షత్రం:

వీరు సాధారణంగా విద్యావంతులు. జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇంకా నిజాయితీగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కూడా ఉంటారు.

మఖ నక్షత్రం:

ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నైతికతతో కలిగి ఉంటారు. జీవితాంతం సంపద, అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు. ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది.

పూర్వ ఫాల్గుణి నక్షత్రం:

పూర్వ ఫాల్గుణి నక్షత్రం లేదా పూరం నక్షత్ర జన్మ కలిగిన వారు అందంగా, పరాక్రమంలోనూ ధీటుగా ఉంటారు. చక్కగా మాట్లాడుతూ ఆజ్ఞాపించడంలోనూ, ఇతరులతో సాంగత్యంతో మెలగడంలోనూ నైపుణ్యాన్ని కనబరుస్తారు. ఇతరులకు లోబడి పనిచేయడానికి ఇష్టపడని స్వతంత్ర మనస్సు గలవారు కావడంతో సొంతగా మెలుగుతారు. ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మార్చగల యోగ్యత కలిగి ఉంటారు. కళల పట్ల ఆసక్తి, విలాసాలపై మోజు వీరికి అదనపు గుణాలుగా చెప్పవచ్చు.

ఉత్తర ఫాల్గుణి నక్షత్రం:

తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలవారు ఈ ఉత్తర ఫాల్గుణి నక్షత్ర జన్మ వారు. ఉత్రం లేదా ఉత్తరి అనే ఈ నక్షత్రాలకు పేరుంది. సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా మార్చగల సామర్థ్యంతో వ్యవహరిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner