Cracked feet: పాదాలు పగుళ్లను తిరిగి మృదువుగా మార్చాలంటే ఇంట్లోనే ఈ క్రీమ్ తయారుచేసి అప్లై చేయండి-prepare and apply this cream at home to soften cracked feet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cracked Feet: పాదాలు పగుళ్లను తిరిగి మృదువుగా మార్చాలంటే ఇంట్లోనే ఈ క్రీమ్ తయారుచేసి అప్లై చేయండి

Cracked feet: పాదాలు పగుళ్లను తిరిగి మృదువుగా మార్చాలంటే ఇంట్లోనే ఈ క్రీమ్ తయారుచేసి అప్లై చేయండి

Haritha Chappa HT Telugu
Dec 02, 2024 09:30 AM IST

Cracked feet: చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. పాదాల అందం కోసం ఇంట్లోనే క్రీమ్ ను రోజూ అప్లై చేయండి. దీన్ని రాయడం మొదలుపెట్టాక కేవలం వారం రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.

పాదాల పగుళ్లను తగ్గించే క్రీమ్
పాదాల పగుళ్లను తగ్గించే క్రీమ్ (Pixabay)

శీతాకాలంలో ఎక్కువ మందికి ఎదురయ్యే సమస్య పాదాల పగుళ్లు. తడి తగలకపోయినా కూడా చలికాలంలో పాదాలు అందం చెడిపోతుంది. చలికాలంలో పాదాలే కాదు, చర్మం మొత్తం పొడిబారే సమస్య ఉంటుంది. ముఖ్యంగా ముఖం కూడా ఎంతో పొడిగా మారుతుంది . ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ పాదాలను పట్టించుకోరు. పాదాల మడమలు పగిలి వికృతంగా కనిపించడం మొదలవుతుంది. కొన్నిసార్లు ఇవి నొప్పిని కూడా కలిగిస్తాయి. అందుకే పాదాల అందాన్ని, ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

రోజులో కాసేపు మీ పాదాల ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. కేవలం ముఖమే కాదు, మీ శరీరంలో మిమ్మల్ని నడిపించే పాదాలు కూడా ముఖ్యమైనవే. అందుకోసం మీరు ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి క్రీములు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే క్రీమ్ తయారుచేసుకోవచ్చు. ఈ క్రీమ్ మీ పాదాల చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇంట్లో మైనపు క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. దీన్ని తయారు చేయడానికి మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. అయితే మీకు ఏ వస్తువులు కావాలో తెలుసుకోండి.

ఇంట్లోనే పాదాల క్రీమ్ తయారీ

పాదాల క్రీమ్ తయారు చేయడానికి మీకు ఒక కొవ్వొత్తి, రెండు స్పూన్ల కొబ్బరి నూనె, రెండు స్పూన్ల ఆవ నూనె, కలబంద జెల్ అవసరం పడతాయి. కొవ్వొత్తులను చాకుతో సన్నగా తురమాలి. ఈ తురిమిన మైనాన్ని ఒక గిన్నెలో వేయండి. ఆ గిన్నెలోనే కొబ్బరి నూనె, ఆవ నూనె, కలబంద జెల్ వేసి కలపాలి. స్టవ్ మీద ఒక గిన్నెపెట్టి ఆ గ్లాసు నీళ్లు వేసి వేడి చేయాలి. ఆ నీళ్లు వేడెక్కాక కొవ్వొత్తుల మిశ్రమం ఉన్న గిన్నెను ఆ వేడి నీటిలో పెట్టి కరిగేలా చేయాలి. దీన్ని చల్లార్చి ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇది చల్లబడ్డాక క్రీమ్ రెడీ అయినట్టే.

ఎలా అప్లై చేయాలి?

ఈ క్రీమ్ రాసుకోవడానికి ముందు ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని వేయండి. అందులో ఒక స్పూను ఉప్పు, రెండు స్పూన్ల షాంపూ వేసి బాగా కలిపాలి. అందులో పాదాలు పెట్టి పది నిమిషాలు ఉంచాలి. తరువాత పాదాల మడమలను గట్టిగా రుద్ది శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మడమపై పేరుకుపోయిన మృతకణాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు పాదాలను పొడి క్లాత్ తో తుడవాలి. ముందుగా చేసిపెట్టుకున్న క్రీమ్ ను అప్లై చేసి పాదాలను పాలిథిన్ కవర్ లో కట్టేయాలి. ఒకటి నుండి రెండు గంటల తర్వాత పాలిథిలిన్ తొలగించండి. వీలైతే ఈ మైనపు క్రీమ్ ను రాత్రిపూట అప్లై చేయాలి. దీన్ని రోజూ అప్లై చేయడం వల్ల ఒకటి రెండు వారాల్లోనే చీలమండ పగుళ్లు తొలగిపోతాయి. మీ పాదాలు ఎంతో సున్నితంగా మారిపోతాయి.

Whats_app_banner