Bigg Boss Nominations: బిగ్ బాస్‌లో ఆఖరి నామినేషన్స్.. ఈ వారం అందరూ డైరెక్ట్ నామినేట్.. మధ్యలోనే విష్ణుప్రియ ఎలిమినేట్!
Bigg Boss Telugu 8 Finale Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8లో ఆఖరి నామినేషన్స్ జరగనున్నాయి. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు 14వ వారం నామినేషన్స్ చివరి నామినేషన్స్. ఈ వారం బిగ్ బాస్ ఫైనల్స్‌కు వెళ్లిన అవినాష్ మినహా మిగతా కంటెస్టెంట్స్ అందరూ డైరెక్ట్ నామినేట్ కాగా మధ్యలోనే ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
Bigg Boss 8 Telugu This Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇక నుంచి టాప్ 5లో ఎవరు ఉండాలి, ఎవరు విజేతగా నిలుస్తారు, గ్రాండ్ ఫినాలే డేట్ వంటి విషయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది ఉంటే ఇద్దరు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్ ఫైనల్స్‌కి అవినాష్
బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇద్దరూ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్, నబీల్, రోహిణి మాత్రమే కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లో ఉన్నారు. వీరిలో టికెట్ టు ఫినాలే గెలిచి బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్‌కి వెళ్లిపోయాడు అవినాష్.
అంటే టాప్ 5లో ఒకరిగా అవినాష్ నిలిచాడు. కాబట్టి, మిగతా ఆరుగురు ఇంటి సభ్యుల్లో టాప్ 4 కంటెస్టెంట్స్ ఎవరనేది కీలకంగా మారింది. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ 8 తెలుగు 14వ వారం నామినేషన్స్ కీలకంగా మారాయి. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు ఈ వారం ఆఖరు నామనేషన్స్ జరగనున్నాయి. అంటే ఈ సీజన్‌లో ఇవే చివరి నామినేషన్స్.
ఎపిసోడ్ ప్రోమో
ఈ విషయాన్ని బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 2 ఎపిసోడ్ ప్రోమోను ఆదివారం (డిసెంబర్ 1) నాటి ఎపిసోడ్ చివరిలో చూపించారు. అందులో కంటెస్టెంట్స్ అందరిని గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా బిగ్ బాస్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో అంతా వచ్చి నిల్చున్నారు.
"ఈ సీజన్‌లో ఆఖరి నామినేషన్స్ ఇప్పుడు మొదలు కాబోతుంది. మీరిప్పుడు ఆడియెన్స్ నిర్ణయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవినాష్ మినహా మిగతా ఇంటి సభ్యులందరూ ఆఖరి సారి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నేరుగా నామినేట్ అయ్యారు" అని బిగ్ బాస్ అనౌన్స్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో హౌజ్‌మేట్స్ అంతా షాక్ అయ్యారు.
ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు
ఇలా బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ నామినేషన్స్‌లో అవినాష్ మినహా మిగతా కంటెస్టెంట్స్ అంతా డైరెక్ట్ నామినేట్ అయ్యారు. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, నిఖిల్, రోహిణి, విష్ణుప్రియ, నబీల్, ప్రేరణ ఆరుగురు ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవ్వనున్నారని సమాచారం.
బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం మధ్యలో ఒకరు, వీకెండ్‌లో మరొకరు ఎలిమినేట్ కానున్నారని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అంటే, మిడ్ వీక్‌లో భాగంగా మధ్యలోనే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అలాగే, వీకెండ్‌లో ఎప్పటిలా మరొకరు ఎవిక్ట్ కానున్నారు. అయితే, ఈ ఆరుగురులో ఎలిమినేట్ అయ్యే ఎక్కువ అవకాశాలు రోహిణి, విష్ణుప్రియకు ఉన్నాయి.
ఒక్క వారం మాత్రమే
రోహిణి ఇప్పటికీ చాలా సార్లు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూ వచ్చింది. రోహిణి నామినేషన్స్‌లో ఒక వారం మాత్రమే ఉంది. దాంతో ఆమెకు సరైన ఓట్ బ్యాంక్ రాలేదు. ఇక విష్ణుప్రియ గత వారమే బాటమ్‌లో ఉంది. ఈ వారం కూడా వీకెండ్‌లో లేదా మధ్యలోనే విష్ణుప్రియ లేదా రోహిణి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
టాపిక్