Green Peas: బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే-do you about green peas health benefits need to add your diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Peas: బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Green Peas: బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 02, 2024 08:30 AM IST

Green Peas: పచ్చి బఠానీలను చాలా మంది ఎక్కువగా పట్టించుకోరు. దాంట్లో పెద్దగా పోషకాలు ఉండవని అనుకుంటారు. అయితే, పచ్చి బఠానీ ఆరోగ్యానికి చాలా లాభాలను చేస్తుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Green Peas: బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే (Photo: Pexels)
Green Peas: బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే (Photo: Pexels)

పచ్చి బఠానీలు వంటకాల్లో రుచికి మాత్రమే చాలా మంది అనుకుంటుంటారు. వీటిలో పెద్దగా పోషకాలు ఏమీ ఉండవనుకుంటూ లైట్‍గా తీసుకుంటుంటారు. అందుకే వీటిని విడిగా చాలా మంది తినరు. అలాగే, స్పెషల్ వంటకాల్లో తప్ప చాలా మంది రెగ్యులర్‌గా వాడరు. అయితే, కాయధాన్యాలకు చెందిన ఈ పచ్చిబఠానీల్లో కీలకమైన విటమిన్స్, మినరల్స్ సహా పోషకాలు మెండుగా ఉంటాయి. తప్పకుండా ఆహారంలో వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి.

పచ్చి బఠానీలో పోషకాలు ఇలా..

పచ్చి బఠానీల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ బీ6, విటమిన్ కే, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ప్రోటీన్, పోలెట్, ఫైబర్ లాంటి కీలకమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

రోగ నిరోధక శక్తి మెరుగు

పచ్చి బఠానీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలం. అందుకే వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు మేలు జరుగుతుంది. రోగాలతో శరీరం పోరాడే శక్తిని ఈ బఠానీలు పెంచగలవు. అందుకే ప్రతీ రోజు ఆహారంలో పచ్చి బఠానీలు తింటే ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడతాయి.

జీర్ణం, బరువు తగ్గడం

పట్టి బఠానీలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఆహారం త్వరగా జీర్ణయ్యేందుకు ఇవి తోడ్పడతాయి. ఇందులోని ఫైబర్ దీనికి సహకరిస్తుంది. పేరుల వ్యాధుల రిస్కును కూడా పచ్చి బఠానీలు తగ్గిస్తాయి. కడుపులో మంచి చేసే బ్యాక్టీరియాను పెంచగలవు. జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గేందుకు కూడా బఠానీలు ఉపకరిస్తాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ డైట్‍లనూ వీటిని తీసుకోవచ్చు.

బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ

శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు కూడా పచ్చి బఠానీలు సహకరిస్తాయి. వీటిలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఒకేసారి ఎక్కువగా పెరగవు. చక్కెర స్థాయి అదుపులో ఉండేలా కూడా ఇవి తోడ్పడతాయి. అందుకే డయాబెటిస్ ఉన్న వారు కూడా వీటిని తినొచ్చు. 

గుండెకు మేలు

రెగ్యులర్‌గా వచ్చి బఠానీలు తింటే గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. వీటిలో మెగ్నిషియం, పొటాషియం లాంటి ఆరోగ్యకరమైన మినరల్స్ ఉంటాయి. ఫైబర్ మెండుగా ఉంటుంది. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు బఠానీలు తోడ్పడతాయి. విటమిన్ సీ కూడా ఇందుకు సహకరిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అందుకే వీలైనంత మేర బఠానీలను రోజువారి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఉపకరిస్తాయి.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది

పచ్చి బఠానీల్లో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సాపోనిన్స్ కూడా అధికం. అందుకే వీటిని తరచూ తింటే క్యాన్సర్ కారకాలను అడ్డుకునేందుకు సహకరిస్తాయి. క్యాన్సర్ వచ్చే రిస్కును పచ్చి బఠానీలు తగ్గించగలవు. అందుకే పూర్తిస్థాయి ఆరోగ్యానికి మేలు చేసే బఠానీలను రెగ్యులర్‌గా ఆహారాల్లో తీసుకోవాలి. ఉడికించుకొని నేరుగా కూడా తినొచ్చు. 

Whats_app_banner