Weight loss: ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా?
Weight loss with Warm Water: బరువు వేగంగా తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. గోరువెచ్చని నీరు తాగడం వెయిట్ లాస్‍కు సహకరిస్తుందా అనే సందేహం ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బరువు తగ్గాలనుకునే వారు పోషకాలు ఉండే ఆహారాలతో డైట్ పాటించడం, వ్యాయమాలు చేయడం ముఖ్యం. అలాగే వేగంగా వెయిట్ లాస్ అవ్వాలంటే మరికొన్ని చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇవి బరువు తగ్గే ప్రయత్నానికి చేయూతనందిస్తాయి. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం.. వెయిట్ లాస్‍కు ఉపయోగపడుతుందని వినిపిస్తుంటుంది. ఇది వాస్తవమేనా అనే డౌట్ కొందరికి వస్తుంటుంది. అది నిజమే. ఉదయయాన్నే ఏమీ తినకముందు పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. అదెలానో ఇక్కడ చూడండి.
క్యాలరీలు బర్న్ అవుతాయి
గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణం పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది. దీనివల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఉపకరిస్తుంది. బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.
కడుపు సమస్యలు తగ్గి..
గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఆహారం మెరుగ్గా జీర్ణం అవుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యయలు తగ్గేందుకు గోరువెచ్చని నీరు సహకరిస్తుంది. పేగుల కదలికను కూడా మెరుగుపరుస్తుంది. ఇది కూడా వెయిట్ లాస్‍కు తోడ్పడుతుంది.
వ్యర్థాలు బయటికి పోయేలా..
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి పోయేలా గోరువెచ్చని నీరు సహకరిస్తుంది. అందుకే పరగడుపున వీటిని తాగడం చాలా ముఖ్యం. ఇవి తాగితే వ్యర్థాలు బయటికి సులభంగా వెళ్లి.. శరీరం లైట్‍గా అనిపిస్తుంది. శరీరం డీటాక్సిఫై అవుతుంది. దీంతో బరువు తగ్గేలా ఉపకరిస్తుంది.
ఇవి కలిపి తాగొచ్చు
గోరువెచ్చని నీటిని అలాగే తాగాలని అనిపించకపోతే కొన్ని పదార్థాలు యాడ్ చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు కలుపుకొని తాగొచ్చు. ఉప్పు కలిగి తాగితే ఎనర్జీ కూడా బాగా ఉంటుంది. మెగ్నిషియయం, సోడియం, పొటాషియం లాంటివి శరీరానికి అందుతాయి. గోరువెచ్చని నీటిలో తేనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు. తేనెలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. ఓవరాల్ ఆరోగ్యానికి ఇది కూడా మేలు చేస్తుంది.
రోజంతా కూడా..
గోరువెచ్చని నీటిని పరగడుపున మాత్రమే కాకుండా రోజంతా తాగవచ్చు. దీనివల్ల బరువు తగ్గే ప్రయత్నానికి మరింత తోడ్పాటు ఉంటుంది. త్వరగా వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరిస్తుంది. పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా గోరువెచ్చని నీరు మేలు చేస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా చేయగలదు.
గోరువెచ్చని నీటితో మరిన్ని ప్రయోజనాలు
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. అవయవాలకు రక్తం మెరుగ్గా చేరుతుంది. దీంతో వాటి పని తీరు మెరుగ్గా, చురుగ్గా ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం దక్కేందుకు సహకరిస్తుంది. నోటి ఆరోగ్యానికి కూడా మేలు జరుతుంది. గోరువెచ్చని నీరు తాగితే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
టాపిక్