పేగుల ఆరోగ్యానికి మేలు చేసే 5 రకాల పండ్లు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 07, 2024

Hindustan Times
Telugu

జీర్ణం, గ్యాస్ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే పేగులు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. మీ పేగుల ఆరోగ్యం, జీర్ణాన్ని మెరుగ్గా చేసే ఐదు రకాల పండ్లు ఇవే.

Photo: Pexels

బ్లూబెర్రీల్లో ఫోలిఫెనాల్స్, ఫైబర్, నేచురల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి‍ తింటే పేగుల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 

Photo: Pexels

యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్ రకం ఉంటుంది. ఇది పేగుల్లోని మైక్రోబయోమ్‍కు ప్రోబయోటిక్‍లా సహకరిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Photo: Pexels

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను కూడా తగ్గించగలదు. 

Photo: Pexels

అరటి పండ్లలో సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగుల కదలికలకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

కివీ పండ్లలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే జీర్ణాన్ని మెరుగుచేయగలవు. వీటిలో అక్టినిడైన్ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థ పని తీరుకు తోడ్పడుతుంది.

Photo: Pexels

చలికాలంలో ఈ బ్రేక్​ఫాస్ట్​ ట్రై చేయండి- రుచితో పాటు ఆరోగ్యం కూడా!

pexels