Investment tips : మిడిల్​ క్లాస్​ ‘ట్రాప్​’ నుంచి బయటపడాలంటే- మ్యూచువల్​ ఫండ్స్​లో ఈ తప్పులు చేయకండి..-mutual funds investment tips for middle class avoid these mistakes to earn crores ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Investment Tips : మిడిల్​ క్లాస్​ ‘ట్రాప్​’ నుంచి బయటపడాలంటే- మ్యూచువల్​ ఫండ్స్​లో ఈ తప్పులు చేయకండి..

Investment tips : మిడిల్​ క్లాస్​ ‘ట్రాప్​’ నుంచి బయటపడాలంటే- మ్యూచువల్​ ఫండ్స్​లో ఈ తప్పులు చేయకండి..

Sharath Chitturi HT Telugu
Nov 30, 2024 09:45 AM IST

Mutual funds investment tips for middle class : మ్యూచువల్​ ఫండ్స్​ ఇన్వెస్ట్​మెంట్​ ద్వారా మనం కోటీశ్వరులు అవ్వొచ్చు! కానీ మనం తెలియక చేసే చిన్నచిన్న తప్పుల కారణంగా కోటీ సంపాదన అనేది కష్టమవుతుంది. అందుకే, ఈ కింద చెప్పే విషయాలను కచ్చితంగా తెలుసుకుని, అప్లై చేయాల్సి ఉంటుంది.

మ్యూచువల్​ ఫండ్స్​ ఇన్వెస్ట్​మెంట్​లో చేయకూడని తప్పులు ఇవి..
మ్యూచువల్​ ఫండ్స్​ ఇన్వెస్ట్​మెంట్​లో చేయకూడని తప్పులు ఇవి..

ద్రవ్యోల్బణంతో పోరాడేందుకు, భవిష్యత్తులో మన లైఫ్​ స్టాండర్డ్స్​ని పెంచుకునేందుకు ఉన్న గొప్ప సాధనం ‘ఇన్వెస్ట్​మెంట్​’. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. కానీ మ్యూచువల్​ ఫండ్స్​ అనేవి మంచి ఆప్షన్​ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం.. అతి తక్కువ డబ్బులను కూడా ఇన్వెస్ట్​ చేసే ఆప్షన్​ ఉండటం! అందుకే ఇటీవలి కాలంలో ఇండియాలో మ్యూచువల్​ ఫండ్స్​కి ఆదరణ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మిడిల్​ క్లాస్​ ప్రజలు పొదుపు చేస్తూ, ఇన్వెస్ట్​ చేస్తున్నారు. అయితే చాలా మందికి ఈ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఫలితంగా తప్పులు చేస్తున్నారు. అందుకే మిడిల్​ క్లాస్​ ట్రాప్​ నుంచి బయటపడాలంటే ఉపయోగపడే సాధమైన మ్యూచువల్​ ఫండ్స్​లో చేయకూడని కొన్ని తప్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఇవి మీ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీకి బాగా ఉపయోగపడతాయి.

మ్యూచువల్​ ఫండ్స్​ ఇన్వెస్ట్​మెంట్​లో ఈ తప్పులు చేయకండి..

  1. మీకు తగ్గ మ్యూచువల్​ ఫండ్​ని ఎంచుకోండి : మ్యూచువల్​ ఫండ్స్​లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కో మ్యూచువల్​ ఫండ్​కు రిస్క్​ అనేది ఒక్కో విధంగా ఉంటుంది. మీ రిస్క్​ సామర్థ్యాన్ని చూసుకోండి. దానికి తగ్గట్టు ఇన్వెస్ట్​మెంట్​ నిర్ణయాలు తీసుకోండి. మ్యూచువల్​ ఫండ్​లో పెట్టుబడి పెట్టే ముందు దాని 'రిస్కోమీటర్'ని కచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
  2. ఎల్లప్పుడు డైరక్ట్​ ప్లాన్​నే ఎంచుకోవాలి : ఇన్వెస్టర్స్​ చేసే పెద్ద తప్పుల్లో ఇదొకటి! చాలా మంది తెలియక రెగ్యులర్​ ప్లాన్​ని ఎంచుకుంటారు. కానీ దాని వల్ల చాలా నష్టాలు చూడాల్సి ఉంటుంది. రెగ్యూలర్​ ప్లాన్​లో ఇన్వెస్టర్స్​కి ఫండ్​ హౌజ్​కి మధ్య బ్రోకర్లు/ ఏజెంట్లు ఉంటారు. మన రిటర్నుల్లో వారికి కమిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఎక్స్​పెన్స్​ రేషియో ఎక్కువ! డైరక్ట్​ ప్లాన్​లో ఇలా ఉండదు. కాబట్టి ఎక్స్​పెన్స్​ రేషియో తక్కువ. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్​మెంట్​పై ఈ ఎక్స్​పెన్స్​ రేషియో గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే జాగ్రత్త!
  3. మీ ఫండ్​ని ట్రాక్​ చేయాల్సిందే : మ్యూచువల్​ ఫండ్స్​ని స్టార్ట్​ చేసి వదిలేయడం కాదు. వాటిని ట్రాక్​ చేస్తూ ఉండాలి. రిటర్నులు ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండవు. కనీసం 3ఏళ్ల పాటు చూసి, సంతృప్తికర రిటర్నులు వస్తుంటే అలాగే ఉంచడం బెటర్​ లేదా మార్చే ఆప్షన్​ని చూసుకోండని నిపుణులు చెబుతుంటారు.
  4. ఇన్వెస్ట్​మెంట్​ అమౌంట్​ని పెంచండి : తొలినాళ్లల్లో తక్కువ డబ్బులతో మ్యూచువల్​ ఫండ్స్​ ఇన్వెస్ట్​మెంట్​ని ప్రారంభించినా తప్పు లేదు! కానీ వాటిని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండాలి. తద్వారా మార్కెట్​లో మీరు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు నెలకు రూ. 3వేలతో మీరు ఇన్వెస్ట్​మెంట్​ ప్రారంభిస్తే.. 12శాతం రిటర్ను(ఇండెక్స్​)తో 30ఏళ్లకు మీ పెట్టుబడి వాల్యూ రూ. 1.05కోట్లుగా ఉంటుంది. అదే మీరు.. మీ రూ. 3వేల ఇన్వెస్ట్​మెంట్​ని ప్రతియేట 10శాతం పెంచుకుంటూ వెళితే.. అదే 30ఏళ్లకు పెట్టుబడి వల్యూ రూ. 2.6కోట్లు దాటిపోతుంది!

(గమనిక:- ఇది సమాచారం కోసం మాత్రమే. ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

Whats_app_banner

సంబంధిత కథనం