Flexi cap Mutual funds : ఇన్వెస్టర్స్​ ఫోకస్​ అంతా ‘ఫ్లెక్సీ క్యాప్​’పైనే- మీరూ ఇన్వెస్ట్​ చేయాలా?-flexi cap mutual funds why are inflows into these schemes on a surge ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flexi Cap Mutual Funds : ఇన్వెస్టర్స్​ ఫోకస్​ అంతా ‘ఫ్లెక్సీ క్యాప్​’పైనే- మీరూ ఇన్వెస్ట్​ చేయాలా?

Flexi cap Mutual funds : ఇన్వెస్టర్స్​ ఫోకస్​ అంతా ‘ఫ్లెక్సీ క్యాప్​’పైనే- మీరూ ఇన్వెస్ట్​ చేయాలా?

Sharath Chitturi HT Telugu
Sep 15, 2024 07:20 AM IST

Flexi cap mutual funds : ఫ్లెక్సీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​కి ఇటీవలి కాలంలో నగదు ప్రవాహం విపరీతంగా పెరుగుతోంది. ఈ ఫండ్స్​లో భారీ రిటర్నులు వస్తుండటం ఇందుకు కారణం. మరి మీరూ ఇందులో ఇన్వెస్ట్​ చేయాలా? అసలు ఫ్లెక్సీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి? పూర్తి వివరాలు..

ఫ్లెక్సీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయాలా?
ఫ్లెక్సీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయాలా?

ఇటీవలి కాలంలో భారతీయుల్లో మ్యూచువల్​ ఫండ్స్​పై అవగాహన పెరుగుతోంది. చాలా మంది సిప్​ చేయడం మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లోకి నిధుల ప్రవాహం పెరుగుతూ వస్తోంది. 2024 ఆగస్టులో ఈ పథకాలకు రూ .3,513 కోట్ల ఇన్​ఫ్లో కనిపించింది! ఇది సెక్టోరల్ ఫండ్స్ తర్వాత రెండవ అత్యధిక ఇన్​ఫ్లో కావడం విశేష.

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్​ ఫండ్స్​ నిస్సందేహంగా రిటైల్ ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. మొత్తంగా ఈ కేటగిరీలో 39 స్కీమ్స్​కి రూ.4,29,311.51 కోట్ల ఏయూఎం ఉండగా, సెక్టోరల్ స్కీమ్ల తర్వాత ఆస్తుల పరిమాణం పరంగా రెండో స్థానంలో దీనిదే! మరి మీరూ ఇన్వెస్ట్​ చేయాలా?

ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ అంటే ఏంటి?

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో కనీసం 65 శాతం అసెట్స్​ని ఇన్వెస్ట్ చేయడం. నవంబర్ 6, 2020 నాటి సెబీ సర్క్యులర్ ద్వారా ప్రకటించిన మ్యూచువల్ ఫండ్స్ కొత్త కేటగిరీ ఇది. దీని ప్రకారం.. ఈ పథకాలు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్​లో పెట్టుబడి పెట్టవచ్చు.

నెలఇన్​ఫ్లో (రూ. కోట్లల్లో)
Jan                  2,447
Feb                2,613
Mar              2,738
April          2,173
May               3,155
June              3,059
July              3,053
August      3,513

(సోర్స్​: యాంఫీ)

పై పట్టికను చూస్తే, అంతకుముందు నెలల్లో ఇన్ ఫ్లోలతో పోలిస్తే ఆగస్టులో ఫ్లెక్సీ క్యాప్ పథకాల్లోకి అత్యధిక ప్రవాహం కనిపించిందని స్పష్టమవుతుంది.

ఇందులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మంచి కేటగిరీ స్కీమ్స్​ కలిగి ఉన్నాయని, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఏ నిష్పత్తిలోనైనా స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలకు వెసులుబాటు కల్పిస్తుందని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.

ఇది మల్టీ క్యాప్ పథకాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో ఫండ్ హౌస్ లు ప్రతి మూడు కేటగిరీల్లో కనీసం 25 శాతం పెట్టుబడి పెట్టాలి.

ఈ అంతర్లీన సౌలభ్యం కారణంగా, ఫండ్ హౌస్​లు స్టాక్స్ అంతటా పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల, అధిక రాబడిని పొందే అవకాశం ఉంది.

కేటగిరీ పర్ఫార్మెన్స్​..

ఇయర్​ఫ్లెక్సీ క్యాప్​ ఫండ్స్​ రిటర్నులు (%)మల్టీ క్యాప్​ ఫండ్స్​ రిటర్నులు (%)
137.20    39.79
226.13               30.38   
318.25               21.53   
522.04   25.70   

(సోర్స్​ మార్నింగ్ స్టార్; సెప్టెంబర్ 11, 2024 నాటికి రిటర్నులు)

పై పట్టికలో మనం చూసినట్లు ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ - ఒక కేటగిరీగా ఇటీవలి కాలంలో రెండంకెల రాబడులను అందించాయి.

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గత ఏడాది రాబడులు 37.20 శాతంగా ఉండగా, గత ఐదేళ్ల వార్షిక రిటర్నులు కూడా 22.04 శాతంగా ఉన్నాయి.

ఆసక్తికరంగా, మల్టీ క్యాప్ ఫండ్స్ గణనీయంగా మంచి పనితీరును కనబరిచాయి. వాటి రాబడులు ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​ మాదిరిగానే ఉన్నాయి.

(గమనిక: ఈ కథ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్​మెంట్ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

సంబంధిత కథనం