Equity mutual fund inflow : ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​లోకి రెండింతల నిధుల ప్రవాహం-equity mutual fund inflow doubles to near rs 14 100 cr in sept ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Equity Mutual Fund Inflow Doubles To Near <Span Class='webrupee'>₹</span>14,100 Cr In Sept

Equity mutual fund inflow : ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​లోకి రెండింతల నిధుల ప్రవాహం

Sharath Chitturi HT Telugu
Oct 10, 2022 06:03 PM IST

Equity mutual fund inflow : ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​లో సెప్టెంబర్​ నెలలో నిధుల ప్రవాహం మామూలుగా లేదు! ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్​లో పెట్టుబడులు 2.3శాతం పెరిగాయి.

దుమ్మురేపిన ఈక్వీటీ మ్యూచువల్​ ఫండ్స్​..!
దుమ్మురేపిన ఈక్వీటీ మ్యూచువల్​ ఫండ్స్​..! (iStock)

Equity mutual fund inflow : ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​లోకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. సెప్టెంబర్​లో రూ. 14,000 కోట్లు మ్యూచువల్​ ఫండ్స్​లోకి వచ్చి చేరాయి. ఆగస్టు నెల నిధుల ప్రవాహంతో పోల్చుకుంటే ఇది 2.3శాతం ఎక్కువగా ఉండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​వైపు మదుపర్లు గత కొంతకాలంగా దృష్టిసారించారు. ఆగస్టులో టాప్​ స్థానంలో నిలిచి డెట్​ మ్యూచువల్​ ఫండ్స్​.. సెప్టెంబర్​లో పతనమయ్యాయి. సెప్టెంబర్​లో డెట్​ మ్యూచువల్​ ఫండ్స్​ నుంచి రూ. 65,300కోట్ల నగదును ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో బంగారం, ఇతర ఈటీఎఫ్​లకు డిమాండ్​ పుంజుకుంది. మొత్తం మీద సెప్టెంబర్​ 30 నాటికి నెట్​ ఏయూఎం(అసెట్​ అండర్​ మేనేజ్​మెంట్​).. రూ. 38.42లక్షల కోట్లుగా నిలిచింది.

Mutual funds latest news : ఏఎంఎఫ్​ఐ డేటా ప్రకారం.. సెప్టెంబర్​లో ఈక్వీటీ స్కీమ్స్​ ఇన్​ఫ్లో రూ. 14,099.73కోట్లుగా ఉంది. ఆగస్టులో అది రూ. 6,119.58కోట్లు మాత్రమే.

ఇక ఈక్విటీలో మిడ్​క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​కు గిరాకీ విపరీతంగా పెరిగింది! మిడ్​క్యాప్​లోకి రూ. 2,151.15కోట్లు వచ్చి చేరాయి. స్మాల్​ క్యాప్​లోకి రూ. 1,825.48కోట్లు చేరాయి. లార్జ్​ అండ్​ మిడ్​క్యాప్​ కాంబీనేషన్​ ఫండ్సలోకి రూ. 1,468.82కోట్ల నిధుల ప్రవాహం జరిగింది. ఫ్లెక్సీ క్యాప్​ ఫండ్​లోకి రూ. 2,401.20కోట్లు చేరాయి. అన్నింటికన్నా.. సెక్టోరల్​ మ్యూచువల్​ ఫండ్స్​లోకి రూ. 4,418.61కోట్ల నిధులు వచ్చి చేరాయి. ఆగస్టులో ఇక్కడ రూ. 1,266.67కోట్ల నిధులు ఔట్​ఫ్లో అయ్యాయి.

"అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చుకుంటే.. దేశీయ మార్కెట్లు మెరుగ్గా ఉన్నాయని మదుపర్లకు అర్థమైంది. అందుకే ఎఫ్​ఐఐలు అమ్ముతున్నా.. డీఐఐలు కొనుగోళ్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​ ఇన్​ఫ్లో పెరుగుతుందని ఆశిస్తున్నాము," అని మోతిలాల్​ ఓస్వాల్​ ఏఎంసీ చీఫ్​ బిజినెస్​ ఆఫీసర్​ అఖిల్​ చతుర్వేది అన్నారు.

Mutual funds inflow in september : ఇక డెట్​ మ్యూచువల్​ ఫండ్స్​ విషయానికొస్తే.. ఆగస్టులో ఇక్కడ రూ. 49,164.29కోట్ల ఇన్​ఫ్లో జరిగింది. కానీ ఈసారి రూ. 65,372.40కోట్ల ఔట్​ఫ్లో జరిగింది. వీటిల్లో లిక్విట్​ ఫండ్స్​(రూ. 59,970.30కోట్లు) నుంచి ఎక్కువ నగదు ఉపసంహరణ జరిగింది.

డెట్​ మార్కెట్​లో అమ్మకాల కారణంగా.. మొత్తం మీద మ్యూచువల్​ ఫండ్స్​లో సెప్టెంబర్​ నెల రూ. 41,404.30కోట్ల నిధుల ఉపసంహరణ జరిగింది. ఆగస్టులో రూ 65,077.46కోట్ల నిధులు చేరాయి.

2022 సెప్టెంబర్​ 30 నాటికి నెట్​ ఏయూఎం.. రూ. 38,42,350.73కోట్లుగా ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం