Mutual funds : మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడికి ముందు ఇవి తెలుసుకోండి!-all you need to know about the things to consider before investing in mutual funds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  All You Need To Know About The Things To Consider Before Investing In Mutual Funds

Mutual funds : మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడికి ముందు ఇవి తెలుసుకోండి!

Sharath Chitturi HT Telugu
Aug 16, 2022 06:57 AM IST

Mutual funds investment : మీరు మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? ఎలా మొదలుపెట్టాలో అర్థంకావడం లేదా? అయితే ఇది మీకోసమే..

మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడికి ముందు ఇవి తెలుసుకోండి!
మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడికి ముందు ఇవి తెలుసుకోండి! (MINT_PRINT)

Mutual funds investment : దేశంలో ఎన్నో రకాల మ్యూచువల్​ ఫండ్స్​ ఉన్నాయి. మ్యూచువల్​ ఫండ్స్​ గురించి నేర్చుకుని, పెట్టుబడులు పెట్టాలన్న యోచనలో ఉన్న బిగినర్లకు ఇవి గందరగోళానికి గురిచేస్తాయి. అందువల్ల.. మ్యూచువల్​ ఫండ్స్​ని ఎంచుకునేందుకు కొన్ని పారామీటర్లు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే.. ఇన్​వెస్టమెంట్​ అనేది సులభమైపోతుంది. అవేంటంటే..

అన్ని మ్యూచువల్​ ఫండ్స్​ ఒకటి కావు..

ఎన్నో రకాల మ్యూచువల్​ ఫండ్స్​ ఉన్నాయి. అవన్నీ ఒకటి కావు! ఒక్కో మ్యూచువల్​ ఫండ్​కు రిస్క్​ అనేది ఒక్కో విధంగా ఉంటుంది. స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల కన్నా.. మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడుల్లో రిస్క్​ కాస్త తక్కువగా ఉంటుందన్నది వాస్తవమే. కానీ మ్యూచువల్​ ఫండ్స్​లో కూడా రిస్క్​ ఉంటుందన్నది గుర్తుపెట్టుకోవాలి.

అందువల్ల మ్యూచువల్​ ఫండ్​లో పెట్టుబడి పెట్టే ముందు దాని రిస్కోమీటర్​ను పరిశీలించాల్సి ఉంటుంది. దాని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు.

డైరక్ట్​ ప్లాన్​తో అధిక రిటర్నులు..

మ్యూచవల్​ ఫండ్స్​లో డైరక్ట్​- రెగ్యూలర్​ అని రెండు ప్లాన్​లు ఉంటాయి. డైరక్ట్​ ప్లాన్​లో ఎక్స్​పెన్స్​ రేషియో తక్కువగా ఉంటుంది. అందువల్ల రెగ్యూలర్​ ప్లాన్​ల కన్నా డైరక్ట్​ ప్లాన్​లు అధిక రిటర్నులు ఇస్తూ ఉంటాయి.

Mutual fund investment in Telugu : రెగ్యూలర్​ ప్లాన్​లో మదుపర్లకు, ఫండ్​ హౌజ్​కు మధ్యలో బ్రోకర్లు/ ఏజెంట్లు ఉంటారు. వారికి కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఎక్స్​పెన్స్​ రేషియో ఎక్కువగా ఉంటుంది. డైరక్ట్​ ప్లాన్​లో మధ్యవర్తులు ఉండరు. ఫలితంగా ఎక్స్​పెన్స్​ రేషియో తక్కువగా ఉంటుంది.

రిటర్నులు.. ఒకే విధంగా ఉండవు

మ్యూచవల్​ ఫండ్స్​ రిటర్నులు వార్షికంగా లెక్కిస్తారు. ఒక ఏడాది వచ్చిన రిటర్నులు చూసి.. ఇక ప్రతి ఏటా ఇదే వస్తుంది అని అనుకోకూడదు.

ఉదాహరణకు ఓ మ్యూచువల్​ ఫండ్​లో ఈ ఏడాది 8శాతం రిటర్నులు వచ్చాయి. దీని ప్రకారం.. వచ్చే ఏడాది, ఆ తర్వాత కూడా 8శాతం రిటర్నులే వస్తాయని కాదు. ఇప్పుడు 8శాతం రిటర్నులు ఇచ్చిన మ్యూచువల్​ ఫండ్​.. వచ్చే ఏడాది 10శాతం ఇవ్వొచ్చు. ఆ తర్వాత ఏడాది.. రిటర్నులు మైనస్​లో కూడా ఉండొచ్చు! అందుకే.. మ్యూచువల్​ ఫండ్​ ప్రదర్శన.. ఒక్క ఏడాదిని చూసి లెక్కించకూడదు. 3ఏళ్లు, 5ఏళ్లు, 10ఏళ్ల ప్రదర్శన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.

ఇక్కడ మదుపర్లు ఒక విషయాన్ని పరిశీలించాలు. ఒక ఏడాది.. విపరీతంగా రిటర్నులు ఇచ్చి.. ఆ తర్వాత పడిపోయే మ్యూచువల్​ ఫండ్స్​ను ఎంచుకోవడం మంచి నిర్ణయం అవ్వదు. అదే సమయంలో.. కన్సిస్టెంట్​గా రిటర్నులు ఇచ్చే మ్యూచువల్​ ఫండ్​పై మరింత భరోసా పెట్టుకోవచ్చు. ఆ విధంగా.. తక్కువ నష్టాలతో మంచి రిటర్నులు వెనకేసుకునే అవకాశం ఉంటుంది.

ఎస్​ఐపీ చేయడమే ఉత్తమం..

Mutual fund SIP : లంప్​సమ్​ కన్నా సిప్​ వెసులబాటును మదుపర్లు ఎంచుకోవడం ఉత్తమం. మార్కెట్​ ఒడుదొడుకుల నుంచి లబ్ధిపొందడంతో పాటు.. సిప్​ అనేది మదుపర్లకు డిసిప్లిన్​ను నేర్పిస్తుంది. డబ్బు సంపాదించాలంటే డిసిప్లిన్​ చాలా ముఖ్యం. సిప్​ చేస్తూ పోతే.. మార్కెట్లు పడినప్పుడు ఎక్కువ యూనిట్​లు లభిస్తాయి. ఫలితంగా యావరేజ్​ అనేది తగ్గుతుంది. మార్కెట్లు పెరిగినప్పుడు.. మంచి రిటర్నులను చూసే అవకాశం ఉంటుంది.

అసెట్​ అలోకేషన్​..

ఉన్న డబ్బులన్నీ ఒకే చోట పెట్టడం సరైనది కాదు. పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్​ అన్నది ఉత్తమమైన స్ట్రాటజీ. అందువల్ల.. ఒకటే సెక్టార్​కు సంబంధించిన స్టాక్స్​లోనే కాకుండా.. వివిధ సెక్టార్లలో స్టాక్స్​, డెట్​ కలయికలోని మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.

ఫండ్​ మేనేజర్​..

Best mutual funds : మంచి రిట్నరులు రావాలంటే.. ఫండ్​ మేనేజర్​ పాత్ర అత్యంత కీలకం! అందువల్ల ఫండ్​ మేనేజర్​ వివరాలను కూడా తెలుసుకోవాలి. వారి ప్రదర్శన, నిర్ణయాలపైనే మదుపర్లకు వచ్చే రిటర్నులు ఆధారపడి ఉంటాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం