Multi cap mutual fund : మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో మంచి రిటర్నులు సాధ్యమేనా?-all you need to know about multi cap mutual fund ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Multi Cap Mutual Fund : మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో మంచి రిటర్నులు సాధ్యమేనా?

Multi cap mutual fund : మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో మంచి రిటర్నులు సాధ్యమేనా?

Sharath Chitturi HT Telugu
Aug 07, 2022 07:30 PM IST

Multi cap mutual fund : మ్యూచువల్​ ఫండ్స్​లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ ఒకటి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము.

<p>మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో మంచి రిటర్నులు సాధ్యమేనా?</p>
<p>మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో మంచి రిటర్నులు సాధ్యమేనా?</p> (MINT_PRINT)

Multi cap mutual fund : మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​కి అర్థం.. పేరులో ఉంది. లార్జ్​ క్యాప్​, మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ కంపెనీల స్టాక్స్​లో ఇన్వెస్ట్​ చేయడమే మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​. మ్యూచువల్​ ఫండ్స్​లో లార్జ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ అని వేరువేరుగా ఆఫ్షన్లు ఉంటాయి. మీరు లార్జ్​ క్యాప్​ని ఎంచుకుంటే.. మిగితా వాటిల్లో ఇన్​వెస్ట్​ చేయలేరు. అందువల్ల వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి.. మంచి రిటర్నులు సంపాదించాలని అనుకునే వారు.. మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ గురించి ఆలోచించచ్చు.

ఈ మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో పలు రకాలు ఉంటాయి.

1. లార్జ్​ క్యాప్​ ప్రిఫరెన్స్​:- ఈ రకం మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో.. లార్జ్​ క్యాప్​ సెగ్మెంట్​కు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆ తర్వాత.. మిడ్​/స్మాల్​ క్యాప్​వైపు చూస్తారు.

2. మిడ్​/స్మాల్​ క్యాప్​ ప్రిఫరెన్స్​:- ఈ రకం మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో.. ముందు.. మిడ్​/స్మాల్​ క్యాప్​ స్టాక్స్​కు ప్రాధాన్యతనిచ్చి.. ఆ తర్వాత లార్జ్​ క్యాప్​వైపు చూస్తారు ఫండ్​ మేనేజర్లు. అది కూడా.. స్టాక్స్​ పడుతున్నప్పుడు బ్యాలెన్స్​ చేసేందుకే.

3. ఎలాంటి ప్రిఫరెన్స్​ లేకపోవడం:- ఈ రకం మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో దేనికీ పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. ఒక స్టాక్​ కచ్చితంగా రాణించగలదు అని ఫండ్​ మేనేజర్​ భావిస్తే.. అందులో మీ నగదు ఇన్​వెస్ట్​ చేస్తారు.

మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి?

గత ఏడేళ్లల్లో.. మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​.. లార్జ్​ క్యాప్​ ఫండ్స్​తో సమానంగా రిటర్నులు జనరేట్​ చేశాయి. అయితే.. స్మాల్​ క్యాప్​/ మిడ్​ క్యాప్​ ఫండ్స్​.. లార్జ్​/ మల్టీ క్యాప్​ ఫండ్స్​తో పోల్చుకుంటే ఎక్కువ రిటర్నులు ఇస్తాయి. అందుకు తగ్గట్టుగానే రిస్క్​ కూడా ఉంటుంది.

What is Multi cap mutual fund : దీర్ఘకాలంలో.. మోస్తారు రిస్క్​ తీసుకుంటూ.. మంచి సంపదను సృష్టించాలని మీరు అనుకుంటే.. మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ను ఎంచుకోవచ్చు. మార్కెట్​లోని అన్ని క్యాప్​ స్టాక్స్​లో పెట్టుబడి పెడుతుండటంతో.. మంచి అవకాశాలు లభిస్తాయి.

మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో రిస్క్​ ఎంత ఉంటుంది?

లార్జ్​ క్యాప్​ ఫండ్స్​లో పెట్టుబడి పెడితే.. పెద్దగా రిస్క్​ ఉండదు. కానీ మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో స్మాల్​, మిడ్​ క్యాప్​ ఆప్షన్లు కూడా ఉంటాయి. అవి రిస్క్​తో కూడుకున్నవి. అక్కడే రిటర్నులు ఎక్కువగా ఉంటుంది.. అక్కడే రిస్క్​ కూడా ఎక్కువగా ఉంటుంది.

పైగా.. మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో.. ఫండ్​ మేనేజర్లు మిడ్​, స్మాల్​ క్యాప్​ ఫండ్స్​వైపు ఎక్కువగా మొగ్గుచూపుతూ ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్లు పడటం మొదలుపెడతాయో.. స్మాల్​, మిడ్​ క్యాప్​ ఫండ్సే ఎక్కువ ఒడిదొడుకులకు లోనవుతూ ఉంటాయి.

ఆ సమయంలో.. ఫండ్​ మేనేజర్​.. వాటిని విడిచిపెట్టి.. లార్జ్​ క్యాప్​ వైపు వస్తారు. ఇదంతా చూస్తే.. మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయని స్పష్టమవుతుంది.

Multi cap fund meaning : మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​లో కనీసం 7ఏళ్లు, అంతకన్నా ఎక్కువగా ఇన్​వెస్ట్​మెంట్​ చేస్తే.. మంచి రిటర్నులు వచ్చే అవకాశం ఉంది. స్వల్పకాలంలో ఒడిదొడుకులు ఉండటం చాలా సహజం. పైగా.. సరైన ఫండ్​ మేనేజర్​ను ఎంచుకోవడం చాలా అవసరం. మార్కెట్​ ఒడిదొడుకుల్లో.. ఫండ్​ని ఫండ్​ మేనేజర్​ ఎలా నిర్వహించారు? అన్నది ఇక్కడ కీలకం. అప్పుడే మెరుగైన రిటర్నులు ఆశించవచ్చు. ఆ ఫండ్​ గత ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ఒక సెక్టార్​లో అవకాశాలను చూసి.. ఫండ్​ మేనేజర్​ అందులో ఎక్కువగా ఇన్​వెస్ట్​ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఆ స్ట్రాటజీ ఒక్కోసారి బెడిసికొట్టొచ్చు కూడా!

Multi cap mutual funds allocation : మల్టీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​పై వచ్చే లాభాల్లో క్యాపిటల్​ ట్యాక్స్​, డీడీటీ(డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్)లు కట్​ అవుతాయి.

ఇవన్నీ చూసి.. మీ ఫైనాన్షియల్​ గోల్స్​కు తగ్గట్టు.. మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి కోసం సొంతంగా ఎనాలసిస్​ చేయాల్సిన అవసరం ఉంది.)

సంబంధిత కథనం