Large cap mutual funds : ఈ​ మ్యూచువల్​ ఫండ్స్​తో.. రిస్క్​ తక్కువ- సంపద ఎక్కువ!-all you need to know about large cap mutual funds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  All You Need To Know About Large Cap Mutual Funds

Large cap mutual funds : ఈ​ మ్యూచువల్​ ఫండ్స్​తో.. రిస్క్​ తక్కువ- సంపద ఎక్కువ!

Sharath Chitturi HT Telugu
Aug 08, 2022 08:06 PM IST

Large cap mutual funds : లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ అంటే ఏంటి? ఇందులో రిస్క్​ ఎలా ఉంటుంది? రిటర్నులు ఎలా ఉంటాయి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము.

లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​తో.. రిస్క్​ తక్కువ- సంపద ఎక్కువ!
లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​తో.. రిస్క్​ తక్కువ- సంపద ఎక్కువ! (Bloomberg)

Large cap mutual funds : ఈక్విటీకి సంబంధించి ఎన్నో రకాల మ్యూచువల్​ ఫండ్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ‘లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​’ ఒకటి. మీరు తక్కువ రిస్క్​ కోసం చూస్తూ.. దీర్ఘకాలంలో నిలకడగా సంపదను వృద్ధి చేసుకోవాలని అనుకుంటుంటే.. లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ గురించి తెలుసుకోవాల్సిందే!

ట్రెండింగ్ వార్తలు

లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​:-

లార్జ్​ మార్కెట్​ క్యాపిటలైజేషన్​ ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడాన్నే లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ అని అంటారు. దీర్ఘకాలంలో.. మదుపర్లకు అదిరిపోయే రీతిలో సంపద తెచ్చిపెడతాయన్న పేరు ఈ లార్జ్​ క్యాప్​ కంపెనీలకు ఉంది. క్రమంగా డివిడెండ్లు ఇస్తూనే.. సంపదను సృష్టించేందుకు కూడా ఈ లార్జ్​ క్యాప్​ సంస్థలు ఉపయోగపడతాయి.

స్మాల్​ క్యాప్​/ మిడ్​ క్యాప్​తో పోల్చుకుంటే ఈ లార్జ్​ ​క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో రిస్క్​ చాలా తక్కువగా ఉంటుంది. మంచి రిటర్నులు కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. రిస్క్​ తక్కువగా ఉండి.. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవాలి అని అనుకునే వారు లార్జ్​ ​క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ను ఎంచుకోవచ్చు.

మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ ప్రకారం.. మార్కెట్​ క్యాపిటల్​లో టాప్​ 100 కంపెనీలను.. లార్జ్​​ క్యాప్​గా గుర్తిస్తారు. అందువల్ల వీటిల్లో పెట్టుబడులు పెడితే రిస్క్​ తక్కువగా ఉంటుంది.

రిస్క్​ తక్కువ.. లాభాలు నిలకడగా!

లార్జ్​ ​క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెడితే.. రిస్క్​ తక్కువ, రిటర్నులు నిలకడగా ఉంటాయి. రిస్క్​ తక్కువగా ఉండటం వల్ల.. ఈ ఫండ్స్​ స్టాక్​ మార్కెట్​ ఒడుదొడుకులను తట్టుకోగలుగుతాయి.

What are Large cap mutual funds : అయితే.. రిస్క్​ తక్కువగా ఉండటం వల్ల ఈ లార్జ్​ ​క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​.. స్మాల్​ క్యాప్​/ మిడ్​ క్యాప్​ కన్నా తక్కువ రిటర్నులు జనరేట్​ చేస్తాయి. ఎక్కడ రిస్క్​ ఎక్కువ ఉంటుందో.. అక్కడ రివార్డ్​ కూడా ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే కదా!

  • లార్జ్​ ​క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టే ముందు ఎక్స్​పెన్స్​ రేషియోను గమనించాల్సి ఉంటుంది. మీ ఫండ్​ను నిర్వహించినందుకు.. ఫండ్​ హౌజ్​ వసూలు చేసే ఫీజే ఈ ఎక్స్​పెన్స్​ రేషియో. ఉన్న దాంట్లో రిటర్నులు ఎక్కువగా రావాలంటే.. ఎక్స్​పెన్స్​ రేషియో తక్కువగా ఉండటం ముఖ్యం.
  • మార్కెట్​ సరైన ప్రదర్శన చేయకపోతే.. లార్జ్​ క్యాప్​ ఫండ్స్​ కూడా డల్​గానే ఉంటాయి. అందువల్ల లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో కనీసం 5-7ఏళ్ల వరకు పెట్టుబడి పెడితేనే మంచి సంపదను చూడవచ్చు. 7ఏళ్ల పాటు ఇన్​వెస్ట్​ చేస్తే.. 10-12శాతం రిటర్నులు వచ్చే అవకాశం ఉంది.
  • లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్​ గోల్స్​పై మీకు అవగాహన ఉండాలి. మీ లక్ష్యాలకు తగ్గట్టుగానే పెట్టుబడులు పెట్టాలి.
  • ఈక్విటీ ఫండ్​ కావడంతో లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​పై క్యాపిటల్​ గెయిన్​ ట్యాక్స్​, డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్​ పడుతుంది.

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మల్టీ క్యాప్ మ్యూచువల్​ ఫండ్​ సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

(గమనిక​:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు.. సొంతంగా ఎనాలసిస్​ చేసుకోవడం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం