Mutual funds SIP : రూ. 10వేల 'సిప్'ని.. 3ఏళ్లల్లో రూ. 9లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్స్
Mutual funds SIP : మంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పేందుకు మరో ఉదాహరణ ఇదే! మూడు మ్యూచువల్ ఫండ్స్.. నెలవారీ రూ. 10వేల సిప్‌ని మూడేళ్లల్లో రూ. 9లక్షలు, అంతకన్నా ఎక్కువగా మార్చాయి.
Mutual funds SIP : 'మ్యూచువల్ ఫండ్స్ సహీ హే..' అంటూ ఎన్నో యాడ్స్ వస్తుంటాయి. అది నిజం కూడా! మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మంచి రిటర్నులు సంపాదించవచ్చని ఎన్నో సందర్భాల్లో రుజవైంది. అయితే.. కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇతర వాటితో పోల్చుకుంటే అద్భుతమైన రిటర్నులు తెచ్చిపెడతాయి. వాటిలో పెట్టుబడి పెడితే.. ఇక మదుపర్లకు సంతోషమే. అలాంటి 3 మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 5స్టార్ రేటింగ్ ఉన్న ఈ 3 మ్యూచువల్ ఫండ్స్.. రూ. 10వేల నెలవారీ సిప్‌ని 3ఏళ్లల్లో రూ. 9లక్షలుగా మార్చడం విశేషం.
Quant Tax Plan - Direct Plan :
ఈ క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ డైరక్ట్ ప్లాన్‌ను 2013 జనవరి 1న ప్రారంభించారు. దీనికి 5స్టార్ రేటింగ్ ఉంది. 2022 జూన్ 30 నాటికి.. Quant Tax Plan - Direct growth ఏఎంయూ (అసెట్ అండర్ మేనేజ్మెంట్) రూ. 1,787.29కోట్లుగా ఉంది. 2022 సెప్టెంబర్ 16 నాటికి ఈ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీ రూ. 269.23గా ఉంది. దీని ఎక్స్పెన్స్ రేషియో 0.57శాతం. ఇతల ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. మూడేళ్ల ముందు ఈ ఫండ్‌లో నెలవారీ రూ. 10వేలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 10.05,531గా ఉంటుంది.
మంచి మ్యూచువల్ ఫండ్‌ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Bank of India Small Cap Fund - Direct Plan
Best mutual funds : బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ డైరక్ట్ ఫండ్‌ని 2018 డిసెంబర్ 19న ప్రారంభించారు. దీనికి కూడా 5 స్టార్ రేటింగ్ ఉంది. 2022 జూన్ 30 నాటికి Bank of India Small Cap Fund - Direct growth ఏఎంయూ రూ. 353.51కోట్లుగా ఉంది. ఇక సెప్టెంబర్ 16 నాటికి దీని ఎన్ఏవీ రూ. 29.01గా ఉంది. దీని ఎక్స్పెన్స్ రేషియో 1.12శాతం. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్‌తో పోల్చుకుంటే ఇది ఎక్కువే! మూడేళ్ల ముందు ఈ మ్యూచువల్ ఫండ్‌లో నెలవారీగా రూ. 10వేలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 9,45,874గా ఉంటుంది.
Canara Robeco Small Cap Fund - Direct Plan
ఈ కెనెరా రొబెకో స్మాల్ క్యాప్ ఫండ్‌ని 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. దీనికి 5స్టార్ రేటింగ్ ఉంది. దీని ఏయూఎం రూ. 3,455.06కోట్లుగా ఉంది. దీని ఎన్ఏవీ రూ. 26.9గా (సెప్టెంబర్ 16నాటికి) ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.47శాతం. స్మాల్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ సగటుతో పోల్చుకుంటే ఇది తక్కువగా ఉంది.
Index mutual funds గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Multicap mutual funds గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏవైనా పెట్టుబడులు పెట్టేముందు సొంతంగా ఎనాలిస్ లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)