Top five small cap mutual funds: టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..-top five small cap mutual funds which gave returns more than 30 percent ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top Five Small Cap Mutual Funds Which Gave Returns More Than 30 Percent

Top five small cap mutual funds: టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..

Aug 30, 2022, 02:36 PM IST HT Telugu Desk
Aug 30, 2022, 02:36 PM , IST

Top five small cap mutual funds: స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో 24 స్కీమ్స్ ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా వెల్లడించింది. వీటిలోకి జూన్‌లో రూ.1,615 కోట్లు, జూలైలో రూ.1,779 కోట్ల నికర ఇన్‌ఫ్లో వచ్చింది. నిర్వహణలో ఉన్న మొత్తం నికర ఆస్తులు జూలై 31 నాటికి రూ. 1.13 లక్షల కోట్లు అని డేటా చెబుతోంది.

నవంబర్ 1996లో ప్రారంభించిన క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 53.15 శాతం ప్రత్యక్ష రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ 51.31 శాతం సాధారణ రాబడిని అందించినట్టు ఆగస్టు 29 నాటి వరకు గల AMFI డేటా విశ్లేషిస్తోంది. ఈ ఫండ్ నిర్వహణలో రోజువారీ ఆస్తులు (AUM) రూ. 2,037 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో బెంచ్ మార్క్ ఇండెక్స్ 28.65 శాతం రాబడిని ఇచ్చింది.

(1 / 5)

ఫిబ్రవరి 2019లో ప్రారంభమైన కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ 43.36 శాతం డైరెక్ట్ రిటర్న్ అందించింది. ఫండ్ 40.88 శాతం రెగ్యులర్ రిటర్న్స్ అందించినట్టు ఆగస్టు 29 నాటి AMFI డేటా విశ్లేషిస్తోంది. ఈ ఫండ్ నిర్వహణలో రోజువారీ ఆస్తులు రూ. 3,384 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ (NIFTY స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్) 28.65 శాతం రాబడిని ఇచ్చింది.

(2 / 5)

డిసెంబర్ 2018లో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 42.98 శాతం డైరెక్ట్ రిటర్న్స్ ఇచ్చింది. 40.54 శాతం మేర రెగ్యులర్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) రూ. 346.76 కోట్లు. అదే సమయంలో బెంచ్ మార్క్ ఇండెక్స్ (NIFTY స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్) 28.65 శాతం రాబడిని ఇచ్చింది.

(3 / 5)

ఫిబ్రవరి 2005లో ప్రారంభమైన కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 38.69 శాతం మేర డైరెక్ట్ రిటర్న్స్ ఇచ్చింది. 36.72 శాతం మేర రెగ్యులర్ రిటర్న్స్ అందించింది, ఈ ఫండ్ నిర్వహణలో రోజువారీ ఆస్తులు (AUM) రూ. 8,241.60 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ (NIFTY స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్) 28.65 శాతం రాబడిని ఇచ్చింది.

(4 / 5)

Nippon India Small Cap Fund: సెప్టెంబర్ 2010లో ప్రారంభించిన నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 37.61 శాతం మేర డైరెక్ట్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 36.41 శాతం మేర రెగ్యులర్ రిటర్న్స్ ఇచ్చింది. ఫండ్ నిర్వహణలో రోజువారీ ఆస్తులు (AUM) రూ. 21,404 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ (NIFTY స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్) 28.65 శాతం రాబడిని ఇచ్చింది. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు