Top Mutual Funds : గత 10 ఏళ్లలో భారీ లాభాలు అందించిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే-investment top mutual funds that give good returns to investors in the last 10 years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top Mutual Funds : గత 10 ఏళ్లలో భారీ లాభాలు అందించిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే

Top Mutual Funds : గత 10 ఏళ్లలో భారీ లాభాలు అందించిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే

Bandaru Satyaprasad HT Telugu
Aug 03, 2024 01:43 PM IST

Top Mutual Funds : మీరు కాస్త రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టాలని భావిస్తే మ్యూచువల్ ఫండ్స్ రాబడి పొందవచ్చు. గత పదేళ్లుగా స్థిరంగా, అధిక రాబడి అందిస్తున్న ఆరు మ్యూచువల్స్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం.

గత 10 ఏళ్లలో భారీ లాభాలు అందించిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే
గత 10 ఏళ్లలో భారీ లాభాలు అందించిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే

Top Mutual Funds : భారతదేశంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా సిప్(SIP) లు ప్రజాదరణ పొందుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI) డేటా ప్రకారం ఒకేసారి పెట్టుబడుల కంటే SIPలలో పెట్టుబడులు జనాదరణ పొందుతున్నాయని తెలుస్తోంది. క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా.. SIPలు బేర్ మార్కెట్‌లలో ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. బుల్ మార్కెట్ సమయంలో తక్కువ యూనిట్లు అందిస్తాయి. అలాగే సిప్ లలో పెట్టుబడులు పెట్టే ప్రక్రియను మీరు ఆటోమేట్ చేసుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా SIPలను చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు. ఇది మీ ఆదాయ స్థాయిల పరిధికి అనుగుణంగా ఉంటుంది. కాంపౌండింగ్ రాబడులు కాలక్రమేణా మీ పెట్టుబడిని గణనీయంగా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

టాప్ మ్యూచువల్ ఫండ్స్

గత 10 సంవత్సరాలలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రాబడిని కలిగి ఉన్నాయి. కొత్త వారికి SIP పెట్టుబడులపై రాబడిని తెలుసుకునేందుకు అత్యంత కచ్చితమైన మార్గం XIRRని ఉపయోగించడం. సంప్రదాయ రిటర్న్ గణనలతో పోల్చితే, ఇది SIPల అత్యుత్తమ మెట్రిక్. మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ సిప్ పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనాలను హైలైట్ చేసేందుకు గత 10 సంవత్సరాల XIRR పనితీరును తెలియజేస్తుంది. మీరు అధిక రాబడి పొందేందుకు దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా కీలకం. గత పదేళ్లుగా స్థిరంగా ఉండి, పెట్టుబడిదారులకు మంచి రాబడులు అందిస్తున్న టాప్-పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ మీకు తెలియజేస్తున్నాం.

ఫండ్ పేరు- ఫండ్ స్వభావం- 10 సంవత్సరాల రాబడి (% లో )

  • నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ -స్మాల్ క్యాప్ ఫండ్- 26.43
  • క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ -స్మాల్ క్యాప్ ఫండ్- 22.54
  • బరోడా BNP పారిబాస్- లార్జ్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్- 16.44
  • ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్- థీమాటిక్ ఫండ్- 22.85
  • JM ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ -ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ -20.67
  • ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ -కాంట్రా ఫండ్ -19.78

మూలం : AMFI (జూలై 30, 2024 నాటికి)

మార్కెట్ రిస్క్

మార్కెట్ పరిస్థితులు నిత్యం మారుతుంటాయి. మునుపటి పరిస్థితులు భవిష్యత్ రిపీట్ అవ్వొచ్చు కాకపోవచ్చు. ఫండ్ మేనేజ్‌మెంట్ లో మార్పు పనితీరుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. సిప్ లు రిస్క్ ప్రొఫైల్ ఎక్కుగా ఉంటుంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్‌కు అనుగుణంగా ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో డబ్బు సంపాదించాలని చూస్తున్నవారు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు.

Disclaimer : మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి మార్కెట్ ఒడిదొడుకులకు లోనై ఉంటుంది. ఈ ఆర్టికల్ మీ అవగాహన మేరకు అందిస్తున్నాం. పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ నిపుణులను సంప్రదించండి.

సంబంధిత కథనం