Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..-mutual funds top performing large mid small flexi cap funds in one year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..

Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Apr 30, 2024 12:05 PM IST

Best mutual funds to invest in 2024 : మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​మెంట్స్​ని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో ఏడాది కాలంలో టాప్​ పర్ఫార్మింగ్​ మ్యూచువల్​ ఫండ్స్​ వివరాలను ఇక్కడ చూడండి..

టాప్​ పర్ఫార్మింగ్​ మ్యూచువల్​ ఫండ్స్​..
టాప్​ పర్ఫార్మింగ్​ మ్యూచువల్​ ఫండ్స్​..

Best mutual funds in India : దీర్ఘకాలంలో స్టాక్​ మార్కెట్​ల నుంచి మంచి ప్రాఫిట్స్​ పొందొచ్చని ప్రజలకు అర్థమవుతోంది. అందుకే.. చాలా మంది స్టాక్​ మార్కెట్​ ఇన్​వెస్ట్​మెంట్​వైపు అడుగులు వేస్తున్నారు. ఫలితంగా.. మ్యూచువల్​ ఫండ్స్​కి డిమాండ్​ విపరీతంగా పెరుగుతోంది. ఎందులో ఫండ్​ని ఎంచుకోవాలి? అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో.. ఏడాది కాలంలో మంచి రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రిటర్నుల ఆధారంగా వివిధ కేటగిరీల్లో ఉత్తమ మ్యూచువల్ ఫండ్లు ఇవే..

లార్జ్ క్యాప్..

ఈ కేటగిరీలో క్వాంట్ లార్జ్ క్యాప్ 55.05 శాతం రాబడిని అందించగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూచిప్ ఫండ్ 47.38 శాతం రిటర్నులు ఇచ్చింది. క్వాంట్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్​లు.. లార్జ్, మిడ్ క్యాప్ స్టాక్స్ రెండింటినీ కోరుకునే ఇన్వెస్టర్లకు 64.41 శాతం రాబడిని అందించాయి.

  • క్వాంట్ లార్జ్ క్యాప్- 55.05%
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూచిప్ ఫండ్- 47.38%
  • క్వాంట్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్- 64.41%

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​..

Best mutual funds to invest : మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​లో చాలా వరకు మంచి పనితీరును కనబరిచాయి. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 72.27 శాతం, జేఎం మిడ్ క్యాప్ ఫండ్ 70.98 శాతం, ఐటీఐ మిడ్ క్యాప్ ఫండ్ 69.42 శాతం, మహీంద్రా మనులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 65.58 శాతం, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 62.61 శాతం రాబడిని అందించాయి.

  • క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్- 72.27%
  • జెఎం మిడ్ క్యాప్ ఫండ్ 70.98%
  • ఐటిఐ మిడ్ క్యాప్ ఫండ్ 69.42%
  • మహీంద్రా మనులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 65.58%
  • మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 62.61%

స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్

స్మాల్​ క్యాప్​ విభాగంలో.. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 78.10%, మహీంద్రా మనులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 78.10%, మహీంద్రా మనులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 73.4% రిటర్నులను అందించాయి. ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 70.18 శాతం రాబడినిచ్చింది.

  • బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్- 78.10%
  • మహీంద్రా మనులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్- 73.45%
  • క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్- 72.10%
  • ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్- 70.18%

మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్..

  • హెచ్ ఎస్ బీసీ మల్టీ క్యాప్ ఫండ్ - 63.49%
  • కోటక్ మల్టీక్యాప్ - 61.03%

ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ 

Top performing mutual funds 2024 : ఈ విభాగంలో.. జేఎం ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్​ ఫండ్ 65.92%, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 63.93%, క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 60.9% రిటర్నులు అందించాయి.

  • జేఎం ఫ్లెక్సీక్యాప్ ఫండ్- 65.92 శాతం
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ- 63.93 శాతం
  • క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్- 60.49 శాతం

ఈ మ్యూచువల్​ ఫండ్స్ ఆయా కేటగిరీల్లో బలమైన రాబడులను ప్రదర్శించినప్పటికీ, గత పనితీరు భవిష్యత్ ఫలితాలను సూచించదని గుర్తుంచుకోవాలి. అందువల్ల, ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సమగ్ర పరిశోధన నిర్వహించడం, ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.

How to invest in Mutual funds : పైన అందించిన వివిధ మ్యూచువల్​ ఫండ్స్​ రిటర్నులు సమాచారం.. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) నుంచి సేకరించాము. ఏప్రిల్ 29, 2024 నాటికి రిటర్నులను ఈవి ప్రతిబింబిస్తాయి.

(గమనిక: ఇది కేవలం సమాచార కోసం రూపొందించిన కథనం మాత్రమే. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం)

Whats_app_banner