Balance advantage funds : బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​తో సూపర్​ రిటర్న్స్​!-what are balance advantage funds and their benefits in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Balance Advantage Funds : బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​తో సూపర్​ రిటర్న్స్​!

Balance advantage funds : బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​తో సూపర్​ రిటర్న్స్​!

Sharath Chitturi HT Telugu
Feb 19, 2024 12:06 PM IST

Balance advantage funds meaning : బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ అంటే ఏంటి? వాటితో ప్రయోజనాలేంటి? ఇక్కడ తెలుసుకుందాము..

బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​తో సూపర్​ రిటర్న్స్!
బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​తో సూపర్​ రిటర్న్స్!

What are Balance advantage funds : మ్యూచువల్​ ఫండ్స్​ జర్నీని మొదలుపెట్టాలని చూస్తున్నారా? కానీ స్టాక్​ మార్కెట్​ రిస్కీ అని భావిస్తున్నారా? అయితే.. మీరు బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ గురించి తెలుసుకోవాల్సిందే! ఈ తరహా మ్యూచువల్​ ఫండ్స్​తో మంచి రిటర్నులు పొందొచ్చని నిపుణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ అంటే ఏంటి? ఎలా పనిచేస్తాయి? లాభాలేంటి? నష్టాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ అంటే ఏంటి?

బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ని డైనమిక్​ అసెట్​ అలాకేషన్​ ఫండ్స్​ అని కూడా ఉంటారు. ఈక్వీటీ, డెట్​.. రెండింట్లోనూ ఇన్​వెస్ట్​ చేసే మంచి మ్యూచువల్​ ఫండ్​ గురించి చూస్తుంటే.. ఈ బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ బెస్ట్ ఆప్షన్​ అవుతాయి! ఈ హైబ్రీడ్​ ఫండ్స్​లో.. మార్కెట్​ పరిస్థితుల బట్టి.. ఫండ్​ అలాకేషన్​ అనేది డెట్​ నుంచి ఈక్విటీకి, ఈక్విటీ నుంచి డెట్​కి మారుతూ ఉంటుంది. ఫలితంగా.. స్టాక్​ మార్కెట్​ రిస్క్​ మారుతూ ఉంటుంది. ఈక్విటీ గ్రోత్​ పొటెన్షియల్​ నుంచి లబ్ధిపొందడమే కాకుండా.. అది ఓవర్​వాల్యూడ్​, వోలటైల్​గా మారినప్పుడు.. రిస్క్​ని తగ్గించుకోవడం కోసం డెట్​లోకి నిధులను మళ్లించడం.. ఈ తరహా ఫండ్స్​ ముఖ్య ఉద్దేశం.

ఈ బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​లో అలాకేషన్​ అనేది ఫిక్స్​డ్​గా ఉండదు. ప్రైజ్​ టు ఎర్నింగ్​ రేషియో, ప్రైజ్​ టు బుక్​ వాల్యూ రేషియో, డివిడెండ్​ యీల్డ్​, వడ్డీ రేట్లు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఫండ్​ అలాకేషన్​ అనేది ఈక్విటీ, డెట్​ మధ్యలో మారుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా కొన్ని స్ట్రాటజీలను ఫాలో అవుతూ ఉంటారు. వాటిల్లో ఒకటి కౌంటర్​ సిక్లికల్​.

Balance advantage funds meaning : కౌంటర్​ సిక్లికల్​:- ఈక్విటీ అండర్​వాల్యూడ్​ దశలో ఉన్నప్పుడు కొని పెట్టుకని, ఓవర్​వాల్యూడ్​లోకి వెళ్లినప్పుడు అమ్మేయడం. ఫలితంగా.. లో ఎంట్రీ పాయింట్​, హై ఎగ్జిట్​ పాయింట్​తో లబ్ధిపొందవచ్చు. అదే సమయంలో డెట్​ నుంచి స్థిరంగా రిటర్నులు పొందొచ్చు. లాంగ్​ టర్మ్​ ఇన్​వెస్టర్స్​కి ఇది బాగా సూట్​ అవుతుంది.

బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​తో లాభాలేంటి?

ఫ్లెక్సిబులిటీ:- బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​లో ఫ్లెక్సిబులిటీ అనేది అతి ముఖ్యమైన లాభం! అసెట్​ అలాకేషన్​ని మార్కెట్​ పరిస్థితులకు తగ్గట్టు మార్చుకోవచ్చు. ఇలా.. ఈక్విటీ, డెట్​ మార్కెట్స్​ నుంచి ఎక్కువ సంపాదించుకోవచ్చు.

డైవర్సిఫికేషన్​:- బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ అనేవి.. అటు ఈక్విటీ, ఇటు డెట్​ సెక్టార్స్​లో పెట్టుబడులు పెడతాయి కాబట్టి.. మీ పోర్ట్​ఫోలియో డైవర్సిఫైడ్​గా ఉంటుంది. ఓవరాల్​ రిస్క్​ కూడా తగ్గుతుంది.

Balance advantage funds returns : ట్యాక్స్​ ఎఫీషియెన్సీ:- ఈ తరహా ఫండ్స్​లో 65శాతం కన్నా అధిక వాటా ఈక్విటీల్లో ఉంటుంది. ఫలితంగా.. దానిని ట్యాక్స్​ వ్యవహారాలకు పరిగణలోకి తీసుకోవచ్చు. డెట్​ ఫండ్స్​తో పోల్చుకుంటే.. వీటి ట్యాక్స్​ రేట్స్​ తక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్​ ఇయర్​లో రిటర్నులు రూ. 1లక్ష దాటితే.. దానిపై 10శాతం లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​ ట్యాక్స్​ పడుతుంది. షార్ట్​ టర్మ్​కి అయితే అది 15శాతంగా ఉంది. ఈ తరహా ఫండ్స్​లో డీడీటీ (డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్​) ఉండదు.

సూటెబులిటీ:- ఎక్కువ రిస్క్​ లేకుండా, మార్కెట్​ని టైమ్​ చేయకూడదు అనుకుని, పోర్ట్​ఫోలియో డైవర్సిఫైడ్​గా ఉండాలని భావించే వారికి.. ఈ ఫండ్​ మంచి ఆప్షన్​ అవుతుంది.

బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​తో రిస్క్​ ఎంత?

Best mutual fund to buy : మార్కెట్​ రిస్క్​:- ఈక్విటీ అంటేనే రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. అందుకే.. బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​లోనూ రిస్క్​ అనేది ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, కార్పొరేట్​ యాక్షన్స్​.. ఈక్విటీ, డెట్​ ఇన్​స్ట్రుమెంట్స్​ని ప్రభావితం చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి.

మోడల్​ రిస్క్​:- బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ అనేవి కొన్ని మోడల్స్​పై ఆధారపడి ఉంటాయి. వాటి ద్వారానే.. ఈక్విటీ, డెట్​ని వాల్యూ చేస్తారు. ఆ మోడల్స్​ అనేవి ప్రతిశారి 100శాతం కచ్చితంగా పనిచేస్తాయని ఏం లేదు. ఫలితంగా తప్పు జరిగితే.. పోర్ట్​ఫోలియోలో పెద్దగా ప్రదర్శన కనిపించదు.

ఫండ్​ మేనేజర్​ రిస్క్​:- ఈ తరహా ఫండ్స్​లో స్కిల్​ అనేది చాలా ముఖ్యం. మార్కెట్​లో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్​ అవ్వాలి అనేది కీలకం. ఫండ్​ మేనేజర్స్​కి దీనిపై పట్టు ఉండాలి. ఫండ్​ మేనేజర్​ ఒక్కోసారి.. తప్పు కూడా చేయవచ్చు.

బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​లో ఎవరు ఇన్​వెస్ట్​ చేయాలి?

Low risk mutual funds : పెద్దగా రిస్క్​ ఇష్టం లేనివారు, మోస్తరు రిస్క్​ తీసుకోగలను అనుకునే వారు, పోర్ట్​ఫోలియోని యాక్టివ్​గా మేనేజ్​ చేయలేను అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది.

అయితే.. ఈ తరహా ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు.. కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే..

Mutual funds explained in Telugu : బ్యాలెన్స్​ అడ్వాంటేజ్​ ఫండ్స్​ అనేవి లాంగ్​ టర్మ్​ ఇన్​వెస్ట్​మెంట్​కి పనికొస్తాయి! కనీసం 5-7ఏళ్ల వరకు ఇన్​వెస్ట్​ చేయాలి. పూర్తిస్థాయి ఈక్విటీ ఫండ్స్​లో కనిపించేంత రిస్క్​ లేకపోయినా.. వీటిల్లోనూ రిస్క్​ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇన్​వెస్ట్​ చేసే ముందు.. ఎక్స్​పెన్స్​ రేషియోని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం