NPS : 'ఎన్​పీఎస్​'తో మీ పెన్షన్​ ప్లాన్​ పదిలం- రిస్క్​ తక్కువ.. రిటర్నులు ఎక్కువ!-5 reasons to opt nps scheme pension plan for better return with minimum risk ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  5 Reasons To Opt Nps Scheme Pension Plan For Better Return With Minimum Risk

NPS : 'ఎన్​పీఎస్​'తో మీ పెన్షన్​ ప్లాన్​ పదిలం- రిస్క్​ తక్కువ.. రిటర్నులు ఎక్కువ!

Sharath Chitturi HT Telugu
Aug 06, 2022 10:37 AM IST

NPS scheme : రిటైర్మెంట్​ తర్వాతి జీవితం కోసం చాలా మంది.. ముందు నుంచే ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వారికోసమే ఈ ఎన్​పీఎస్​. ఇందులో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి.

'ఎన్​పీఎస్​'తో మీ పెన్షన్​ ప్లాన్​ పదిలం- స్కీమ్​తో ప్రయోజనాలెన్నో!
'ఎన్​పీఎస్​'తో మీ పెన్షన్​ ప్లాన్​ పదిలం- స్కీమ్​తో ప్రయోజనాలెన్నో! (MINT)

NPS scheme : నేషనల్​ పెన్షన్​ సిస్టమ్​(ఎన్​పీఎస్​)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం మద్దతున్న ఎన్​పీఎస్ పెన్షన్​ ప్లాన్​లో పెట్టుబడుల ప్రవాహం.. ఇటీవలి కాలంలో పెరిగింది. ఈక్విటీ, డెట్​ ఆప్షన్లు కలిగి ఉండటంతో ఈ ఎన్​పీఎస్​ స్కీమ్​ మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎన్​పీఎస్​ పెన్షన్​ ప్లాన్​లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న ఐదు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

  • పెట్టుబడిలో స్వేచ్ఛ:- ఏడాదిలో ఒకసారి ఎన్​పీఎస్​లో పెట్టుబడి చేయవచ్చు. లేదా.. నెలనెల కూడా డబ్బులు కట్టవచ్చు. టైర్​ 1 కు రూ. 500, టైర్​ -2 ఖాతాలకు రూ. 1000 మినిమమ్​ లిమిట్​గా ఉంది. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడుల మొత్తాన్ని మార్చుకోవచ్చు.
  • పెట్టుబడులు పదిలం:- ఎన్​పీఎస్​కు ప్రభుత్వం మద్దతిస్తుండటం ఈ స్కీమ్​కు అతిపెద్ద ప్రయోజనం. డబ్బులు నష్టపోతామన్న భయం అవసరం ఉండదు. పీఎఫ్​ఆర్​డీఏ పర్యవేక్షణ ఉండటంతో.. స్కీమ్​కు మరింత పారదర్శకత లభిస్తుంది. అంతేకాకుండా.. మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. మరో 6-8 నెలల్లో కొత్త ప్రాడక్టు తీసుకొచ్చేందుకు ఎన్​పీఎస్​ ప్రయత్నిస్తోంది. రిటర్నులపై మరింత కచ్చితత్వంతో ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలుస్తోంది. అయితే.. మీరు దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఒకటే ఎన్​పీఎస్​ ఖాతా ఉంటుంది. హైదరాబాద్​లో ఖాతా ఓపెన్​ చేసి, ముంబైలో ఉద్యోగం కోసం వెళ్లినా.. ఏమీ మారదు. ఒకటే ఎన్​పీఎస్​ ఖాతా ఉంటుంది.
  • ఫండ్​ మేనేజర్​:- పెట్టుబడి పెట్టిన తర్వాత.. ఆ నగదు ఎక్కడికి వెళ్లాలి? ఎవరు మేనేజ్​ చేయాలి? అన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. మీ ఫండ్​ మేనేజర్​ పనితీరు పట్ల మీరు అసంతృప్తిగా ఉంటే.. మార్పులు చేసుకోవచ్చు. ఏడాదికి ఓసారి మీ ఫండ్​ మేనేజర్​ను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. వయస్సుకు తగ్గట్టు మీ రిస్క్​ ఆఫ్షన్లు కూడా ఏడాదికోసారి మార్చుకోవచ్చు.
  • ట్యాక్స్​ బెనిఫిట్​:- ఎన్​పీఎస్​లో పెట్టుబడి ద్వారా రూ. 2లక్షల వరకు ట్యాక్స్​ బెనిఫిట్​ పొందవచ్చు. అయితే.. నెలవారీ పెన్షన్​పై వార్షికంగా ట్యాక్స్​ పడుతుంది.
  • రిటైర్మెంట్​ తర్వాత ప్రతినెల కచ్చితంగా ఆదాయం:- రిటైర్మెంట్​ తర్వాత ఎన్​పీఎస్​ స్కీమ్​ నుంచి 60శాతం కార్పస్​ను లంప్​సమ్​గా వెనక్కి తీసుకోవచ్చు. ఇది ట్యాక్స్​ ఫ్రీ. అన్యూనిటీ ప్లాన్​కు మరో 40శాతం వెళుతుంది. ఇలా రిటైర్మెంట్​ తర్వాత నెలకు కచ్చితమైన ఆదాయం లభించే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం