పన్నులు ఆదా చేయడానికి సెక్షన్ 80C కాకుండా ఇతర మార్గాలు ఇవే!-other ways save more taxes to section 80c ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పన్నులు ఆదా చేయడానికి సెక్షన్ 80c కాకుండా ఇతర మార్గాలు ఇవే!

పన్నులు ఆదా చేయడానికి సెక్షన్ 80C కాకుండా ఇతర మార్గాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Apr 21, 2022 05:08 PM IST

ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసేవారికి సెక్షన్‌ 80- C కింద కొన్ని రకాల పెట్టుబడులు, విరాళాలకు మినహాయింపు ఉంటుంది. ఈ మినహాయింపు ద్వారా రూ.1,50,000 ఆదా చేసుకోవ‌చ్చు. అయితే సెక్షన్‌ 80- C ద్వారానే కాకుండా ఇతర సెక్షన్స్ ద్వారా కూడా పన్నులు అదా చేసుకోవచ్చు.. అవేంటో తెలుసుకుందాం.

Income Tax
Income Tax (istock)

సెక్షన్ 80C కాకుండా పన్ను ఆదా చేసుకోవడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఈ అంశంపై కొంత మందికి మాత్రమే అవగాహన ఉం. సెక్షన్ 80C ప్రకారం, పన్ను చెల్లింపుదారుడు తమ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు తగ్గించుకోవచ్చు. సెక్షన్ 80C ద్వారా పన్ను తగ్గింపు రూ. 1.5 లక్షల వరకు పరిమితి ఉన్నందున చాలా మంది టాక్స్ పేయర్స్ ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే సెక్షన్ 80C ద్వారానే కాకుండా ఇతర సెక్షన్స్ ద్వారా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు.

1. NPS ఖాతా - 80CCD (1B)

నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పథకం. సెక్షన్ 80CCD(1) కింద రూ. 50,000 వరకు అదనపు మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందుతున్న పన్ను చెల్లింపుదారులు ఈ సెక్షన్‌కు అర్హులు.

2. హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం - సెక్షన్ 80D

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D ప్రకారం, ఆరోగ్య సంరక్షణ కోసం చేసే ఖర్చులతో పాటుగా.. ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపు వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ సెక్షన్ కింద, మీ జీవిత భాగస్వామికి, పిల్లలకు ఆర్థిక సంవత్సరానికి రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి మీకు అనుమతి ఉంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చేల్లించే సీనియర్ సిటిజన్ల రూ. 25,000 అదనపు మినహాయింపుకు అర్హత ఉంది.

3. అద్దె చెల్లింపు - సెక్షన్ 80GG

అద్దె ఇంట్లో నివసిస్తున్న  ఉద్యోగులు ఇంటి అద్దె అలవెన్స్ (HRA) సహాయంతో తమ పన్ను మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. సెక్షన్ 80GG ప్రకారం, పన్ను చెల్లింపుదారులు తమ వసతి కోసం చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపుపై క్లెయిమ్ చేయవచ్చు. ఉద్యోగులు పొందే HRA అధారంగా ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఉద్యోగి అద్దె ఇంటిలో నివసించకపోతే HRAపై పూర్తిగా పన్ను విధించబడుతుంది.

4. ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ - సెక్షన్ 80E

ఉన్నత చదువుల కోసం విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను ప్రయోజనం, ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. విద్యా రుణం తీసుకున్న విద్యార్థులు సెక్షన్ 80Eపై లోన్ వడ్డీ భాగంపై పన్ను మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులకు లేదా విద్యార్థిలు ఈ సెక్షన్ కింద ప్రయోజనం పొందవచ్చు.

5. గృహ రుణ వడ్డీ చెల్లింపు - సెక్షన్ 24

గృహ రుణ EMI చెల్లించి వారికి సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయించబడుతుంది. వడ్డీపై సెక్షన్ 24 ప్రకారం రూ. 2 లక్షల వరకు మినహాయించబడుతుంది. లోన్ ముగింపు తేదీ తర్వాత 5 సంవత్సరాలలోపు నివాసం ఉన్నట్లయితే మాత్రమే పన్ను ప్రయోజనం ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్