(1 / 5)
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే.. మిడ్ క్యాప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం. మార్కెట్ క్యాపిటలైజేషన్లో 101-250 మధ్యలో ఉన్న సంస్థలను మిడ్ క్యాప్‌లుగా పిలుస్తుంటారు. ఫండ్ మేనేజర్లు వాటిల్లో పెట్టుబడి పెడతారు.
(2 / 5)
మిడ్ క్యాంప్ సంస్థలు.. లార్జ్ క్యాప్- స్మాల్ క్యాప్‌ల మధ్యలో నిలబడతాయి. ఇది మదుపర్లకు కొంత ప్రయోజనం చేకూర్చే విషయమే. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా.. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో రిటర్నులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ.. అందుకు తగ్గట్టుగానే.. రిస్క్ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది.
(3 / 5)
అదే సమయంలో.. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చుకుంటే.. మిడ్ క్యాప్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువగా, నిలకడగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే..మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మంచి రిస్క్‌తో మంచి రివార్డు లభిస్తుందని నిపుణులు అంటారు.
(4 / 5)
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కోసం రిస్క్‌తో పాటు.. మీ ఫైనాన్షియల్ గోల్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి. మీరు యంగ్ ఏజ్‌లో ఉంటే.. రిస్క్ తీసుకోవచ్చు. అదే రిటైర్మెంట్కు సమీపిస్తున్నప్పుడు రిస్క్ తీసుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరం కాదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(5 / 5)
ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు.. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.
ఇతర గ్యాలరీలు