Gold ETF investment : ‘గోల్డ్​ ఈటీఎఫ్​’.. బంగారంలో ఇన్​వెస్ట్​మెంట్​కు ది బెస్ట్​ ఆప్షన్!-all you need to know on how to select best gold etf in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Etf Investment : ‘గోల్డ్​ ఈటీఎఫ్​’.. బంగారంలో ఇన్​వెస్ట్​మెంట్​కు ది బెస్ట్​ ఆప్షన్!

Gold ETF investment : ‘గోల్డ్​ ఈటీఎఫ్​’.. బంగారంలో ఇన్​వెస్ట్​మెంట్​కు ది బెస్ట్​ ఆప్షన్!

Sharath Chitturi HT Telugu
Jun 18, 2023 10:36 AM IST

How to select gold ETF : మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మరి మీకు గోల్డ్​ ఈటీఎఫ్​ గురించి తెలుసా? తెలుసుకుంటే.. ఇక వదిలిపెట్టరు! గోల్డ్​ ఈటీఎఫ్​ ప్రయోజనాలతో పాటు మంచి ఆప్షన్​ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..

‘గోల్డ్​ ఈటీఎఫ్​’.. బంగారంలో ఇన్​వెస్ట్​మెంట్​కు ది బెస్ట్​ ఆప్షన్!
‘గోల్డ్​ ఈటీఎఫ్​’.. బంగారంలో ఇన్​వెస్ట్​మెంట్​కు ది బెస్ట్​ ఆప్షన్! (Unsplash)

How to select gold ETF : బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు! గోల్డ్​ అనేది దీర్ఘకాలానికి మంచి ఇన్​వెస్ట్​మెంట్​ ఆప్షన్​ అని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే మార్కెట్​లో ఉన్న గోల్డ్​ను కొనుగోలు చేసి, ఇన్​వెస్ట్​మెంట్​ అంటే మాత్రం తప్పు చేస్తున్నట్టే! ఇలా చేస్తే సరైన ఫలితాలు ఉండవు. అలా అని బంగారంలో ఇన్​వెస్ట్​ చేయకపోవడం కూడా తప్పే! అందుకే.. 'గోల్డ్​ ఈటీఎఫ్​' ది బెస్ట్​ ఆప్షన్​ అని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ గోల్డ్​ ఈటీఎఫ్​? దీనితో వచ్చే ప్రయోజనాలేంటి? ఒక మంచి గోల్డ్​ ఈటీఎఫ్​ను ఎంపిక చేసుకోవడం ఎలా? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

గోల్డ్​ ఈటీఎఫ్​ అంటే ఏంటి..?

గోల్డ్​ ఈటీఎఫ్​ గురించి తెలుసుకునే ముందు.. ఈటీఎఫ్​ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈటీఎఫ్​ అంటే.. 'ఎక్స్​ఛేంజ్​ ట్రేడెడ్​ ఫండ్​'. ఇది మ్యూచువల్​ ఫండ్స్​ సిస్టెమ్​ను పోలి ఉంటుంది. మ్యూచువల్​ ఫండ్స్​లో చాలా స్టాక్స్​ను ఒక్క చోటకు తీసుకొస్తారు. వాటిని యూనిట్​లుగా విక్రయిస్తుంటారు. ఈటీఎఫ్​లు కూడా అంతే! కానీ మ్యూచువల్​ ఫండ్స్​, ఈటీఎఫ్​కు ఒక ప్రధాన వ్యత్యాసం ఉంది. అందేంటంటే.. మ్యూచువల్​ ఫండ్స్​ కోసం ఫండ్​ హౌజ్​లలో ఇన్​వెస్ట్​ చేయాలి. కానీ ఈటీఎఫ్​లలో మనం, మన సొంతంగా డిమ్యాట్​ అకౌంట్​లో వాటిని కొనుగోలు చేయవచ్చు, విక్రయించ్చు. అంటే.. సాధారణ స్టాక్స్​ను ఎలా కొని, విక్రయిస్తామో.. ఈటీఎఫ్​లు కూడా అంతే.

ఇక గోల్డ్​ ఈటీఎఫ్​తో వచ్చే యూనిట్​లు.. హై ప్యూరిటీతో కూడిన ఫిజికల్​ గోల్డ్​తో సమానం. దీర్ఘకాలంలో పెట్టుబడులు చేస్తూ, వాటిని విక్రయించిన తర్వాత డబ్బులను పొందవచ్చు.

గోల్డ్​ ఈటీఎఫ్​తో ప్రయోజనాలివే..

What is Gold ETF : సాధారణంగా.. జ్యువెలరీ షాప్​కు వెళ్లి గోల్డ్​ కొంటే.. తరుగు, మేకింగ్​ ఛార్జీలు వంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ గోల్డ్​ ఈటీఎఫ్​లో అలాంటి బాధలు ఉందవు!

బయట ఉండే వాట్​, సేల్స్​ ట్యాక్స్​, వెల్త్​ ట్యాక్స్​ వంటివి గోల్డ్​ ఈటీఎఫ్​లలో ఉండవు.

ఈ గోల్డ్​ ఈటీఎఫ్​ను 'హెడ్జింగ్​' కోసం కూడా వాడుకొవచ్చు. సాధారణంగా అనిశ్చితి సమయాల్లో స్టాక్​ మార్కెట్​లు పడుతుంటాయి. అదే సమయంలో గోల్డ్​ పెరుగుతుండటాన్ని గమనించే ఉంటాము. ఫలితంగా.. గోల్డ్​ ఈటీఎఫ్​తో మన ఇన్​వెస్ట్​మెంట్​ను డైవర్సిఫైడ్​ చేసుకోవచ్చు. అయితే ఈ ఈటీఎఫ్​లపై లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​ ట్యాక్స్​ పడుతుందని గుర్తుపెట్టుకోవాలి.

ఇదీ చూడండి:- బంగారంలో ఇన్​వెస్ట్​ చేయాలా? టాప్​ 5 గోల్డ్​ ఈటీఫ్​లు ఇవే..!

మంచి గోల్డ్​ ఈటీఎఫ్​ను ఎలా ఎంచుకోవాలి?

సాధారణంగా ఒక స్టాక్​ని ఎంచుకునేడప్పుడు ఫండమెంటల్​ ఎనాలసిస్​ చేస్తాము. ఒక మ్యూచువల్​ ఫండ్​ను ఎంచుకునే ముందు.. దాని రిటర్నులు, ఫండ్​ మేనేజర్​, టైప్​, ఎక్స్​పెన్స్​ రేషియో వంటివి చూస్తాము. అదే విధంగా.. గోల్డ్​ ఈటీఎఫ్​ను ఎంచుకునే ముందు కొన్ని ఫ్యాక్టర్స్​ని పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే..

ట్రేడింగ్​ వాల్యూమ్​..

Best Gold ETF's in India : వాల్యూమ్​ అనేది ఈటీఎఫ్​లలో చాలా కీలకమైన విషయం. వాల్యూమ్​లు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది! వాల్యూమ్​లు ఎక్కువ ఉంటే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. కొనాలన్నా, అమ్మాలన్నా సులభంగా ఉంటుంది. లిక్విడిటీ లేని ఈటీఎఫ్​లలో పెట్టుబడులు పెట్టినా, సరైన బయ్యర్​ లేకపోతే అమ్మేడప్పుడు కాస్త కష్టపడాల్సి వస్తుంది.

ట్రాకింగ్​ ఎర్రర్​..

ఈటీఎఫ్​లలో ట్రాకింగ్​ ఎర్రర్​ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. మార్కెట్​లో బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. నిర్దిష్ట సమయానికి బయట మార్కెట్​లో ఉన్న రేటు, గోల్డ్​ ఈటీఎఫ్​లోని ఎన్​ఏవీ (నెట్​ అసెట్​ వాల్యూ) రిఫ్లెక్ట్​ అవ్వకపోవచ్చు. దీనినే ట్రాకింగ్​ ఎర్రర్​ అంటారు. ప్రతి ఈటీఎఫ్​కు ఇది కచ్చితంగా ఉంటుంది. అయితే.. ట్రాకింగ్​ ఎర్రర్​ తక్కువగా ఉన్న గోల్డ్​ ఈటీఎఫ్​లను ఎంచుకోవడంతో లాభాలు మెరుగుపడతాయి.

ఎక్స్​పెన్స్​ రేషియో..

Gold ETF returns : అసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీ వసూలు చేసేదే ఈ ఎక్స్​పెన్స్​ రేషియో. మ్యూచువల్​ ఫండ్స్​లోనూ ఉంటుంది. కాకాపోతే.. మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చితే ఈటీఎఫ్​లలో ఇది తక్కువగా ఉంటుంది.

చివరిగా.. డిమ్యాట్​ అకౌంట్​లో గోల్డ్​ ఈటీఎఫ్​ అని టైప్​ చేస్తే చాలా ఆప్షన్స్​ వస్తాయి. వాటిల్లో గోల్డ్​బీస్​ అని ఒకటి ఉంటుంది. గతంలో నిప్పాన్​ సంస్థకు చెందిన గోల్డ్​ ఈటీఎఫ్​ను ఇప్పుడు గోల్డ్​బీస్​ అని పిలుస్తున్నారు. ఇదొక బెంచ్​మార్క్​లాగా పరిగణిస్తారు.

సంబంధిత కథనం