Gold and silver rate today : స్థిరంగా వెండి, పసిడి ధరలు.. ప్లాటీనం కూడా!-gold and silver rate today 18 june 2023 see prices in hyderabad vijayawada mumbai ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rate Today : స్థిరంగా వెండి, పసిడి ధరలు.. ప్లాటీనం కూడా!

Gold and silver rate today : స్థిరంగా వెండి, పసిడి ధరలు.. ప్లాటీనం కూడా!

Sharath Chitturi HT Telugu
Jun 18, 2023 09:08 AM IST

Gold and silver rate today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు కూడా మారలేదు. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (MINT_PRINT)

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,100గా ఉంది. శనివారం ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,51,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,510గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 60,110గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,01,100గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,260గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,260గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,110గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,1000గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,110గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,150గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,160గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,110గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,160గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,110గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

స్థిరంగా వెండి..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,350గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 73,500గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,500.. బెంగళూరులో రూ. 74,750గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ 25,860గా ఉంది. ఆ ముందు రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,860గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం