Gold price in 2023 : 2023లో బంగారం ధర @62,000- వెండి ధర @80,000..!
Gold price in 2023 : 2022లో రూ. 50వేలను తాకిన పసిడ ధర.. 2023లో రూ. 62వేలకు చేరుతుందని ఐసీఐసీఐడైరక్ట్ బ్రోకరేజ్ పేర్కొంది. ఈ మేరకు 2023 కమోడిటీస్ ఔట్‌లుక్‌ను విడుదల చేసింది.
Gold price in 2023 : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భగభగమంటున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 50వేలు దాటేసింది. ఈ క్రమంలో.. 2023లో ఇదే బంగారం ధర రూ. 62వేలను తాకుతుందని ఐసీఐసీఐడైరక్ట్ పేర్కొంది. ఈ మేరకు.. 2023 ఏడాదికి సంబంధించిన కమోడిటీ ఔట్లుక్ నివేదికను విడుదల చేసింది.
ఐసీఐసీఐడైరక్ట్ 2023 కమోడిటీ ఔట్లుక్ రిపోర్ట్ ప్రకారం.. కేజీ వెండి ధర రూ. 80వేలను తాకుతుంది. ప్రస్తుతం ఈ ధర రూ. 70వేల వద్ద ఉంది.
2022లో.. పసిడి ధరలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అనిశ్చితి, చైనాలో ట్రేడ్ అవకాశాలు తగ్గడం వంటివి కొన్ని కారణాలుగా ఉన్నాయి. అయితే.. 2023లో మెటల్స్ మార్కెట్లో సప్లైకు సంబంధించిన నియంత్రణలు ఉంటాయని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఫలితంగా సప్లై తగ్గి, డిమాండ్ పెరుగడంతో, ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Investment in Gold : ఇతర కమోడిటీస్‌కు సంబంధించి.. కాపర్ కేజీకి రూ. 850 వద్దకు చేరుతుందని, అల్యుమీనియం.. కేజీకి రూ. 260 వద్దకు వెళుతుందని ఐసీఐసీఐడైరక్ట్.. తన రిపోర్టులో పేర్కొంది. మరోవైపు జింక్.. కేజీకి రూ. 350ని తాకుతుందని, క్రూడ్ ధరలు స్థిరంగా ఉంటాయని అంచనా వేసింది ఐసీఐసీఐడైరక్ట్.
ఐసీఐసీఐడైరక్ట్ ప్రకారం.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ.. 2022లో చమురు మార్కెట్ భారీగా దెబ్బతింది. డిమాండ్‌కు తగ్గట్టుగానే ఉత్పత్తి కూడా ఉండటం ఇందుకు కారణం. 2023లో చైనా వ్యవస్థ తెరుచుకుంటుండటం, చమురు ఉత్పత్తిని ఒపెక్ కట్ చేస్తుండటం, అంతర్జాతీయంగా చమురు వినియోగం పెరుగుతుందన్న అంచనాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి. కొవిడ్ ఆంక్షలు తొలగిపోతుండటంతో.. మొబిలిటీ పెరిగి, చమురుకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా చైనాలో చమురు దిగుమతులు కూడా వృద్ధి చెందుతాయి.
ICICDirect Gold outlook 2023 : "ఐఎంఎఫ్ రివైజడ్జ్ గ్లోబల్ జీడీపీ అంచనాలు, దిగొస్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు తీవ్రత తగ్గడం, డాలర్ బలహీనపడటం, చైనా రీఓపెనింగ్ కారణాలతో.. 2023లో అంతర్జాతీయ కమొడిటీ మార్కెట్లు మిశ్రమంగా ఉండొచ్చు," అని ఐసీఐసీఐడైరక్ట్ నివేదిక వెల్లడించింది.
బంగారం, వెండి ధరలు..
2023 gold price outlook : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 50,050కి చేరింది. గురువారం ఈ ధర రూ. 50,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 5,00,500కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,005గా ఉంది.
Gold rate today Hyderabad : మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 54,600కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 54,710గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 దిగొచ్చి.. రూ. 5,46,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,460గా ఉంది.
Silver rates today : మరోవైపు దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,030గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 2000 పడి.. రూ. 70,300కి చేరింది. గురువారం ఈ ధర రూ. 72,300గా ఉండేది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం