Choose gold loan: అర్జెంట్ గా క్యాష్ కావాలా? గోల్డ్ లోన్ కెళ్లడం బెటర్..-top 5 reasons to choose gold loan in an emergency cash crisis ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Choose Gold Loan: అర్జెంట్ గా క్యాష్ కావాలా? గోల్డ్ లోన్ కెళ్లడం బెటర్..

Choose gold loan: అర్జెంట్ గా క్యాష్ కావాలా? గోల్డ్ లోన్ కెళ్లడం బెటర్..

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 08:29 PM IST

ఎప్పుడు, ఎందుకు డబ్బు అవసరం పడుతుందో తెలియదు. అత్యవసరంగా డబ్బు అవసరమైతే, చేబదుళ్లో, వడ్డీకి తెచ్చుకోవడమో చేస్తుంటాం. కానీ, సులభంగా, చవకగా, త్వరగా రుణం పొందాలంటే గోల్డ్ లోన్ (gold loan) బెటర్.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇప్పుడు బ్యాంక్ లే కాకుండా, ముతూట్ ఫైనాన్స్ వంటి కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు (Fintechs) కూడా గోల్డ్ లోన్ (gold loan) లను ఇస్తున్నాయి. బ్యాంక్ ల కన్నా అవి తక్కువ వడ్డీకి, ఒక్కో గ్రాముకు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తున్నాయి.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

త్వరగా, చవకగా..

ప్రస్తుతం మార్కెట్లో క్యాష్ అత్యవసరమైతే, పర్సనల్ లోన్, లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్, మార్టిగేజ్ లోన్.. తదితర విధానాలున్నాయి. లోన్ అత్యవసరమైన సమయాల్లో, ఎక్కువ ప్రాసెసింగ్ సమయం పట్టే, ఎక్కువ వడ్డీ తీసుకునే విధానాల కన్నా, త్వరగా ప్రాసెసింగ్ పూర్తయ్యే విధానాలకు వెళ్లడం మంచింది. అలాంటి విధానాల్లో గోల్డ్ లోన్ (gold loan) ఒకటి. గోల్డ్ లోన్ కు ఎందుకు బెటరో చెప్పే ఐదు కారణాలివి..

Eligibility criteria made easy: అందరికీ అందుబాటులో

ఈ గోల్డ్ లోన్ (gold loan) పొందడానికి పెద్దగా అర్హతలు అక్కర్లేదు. మీ వయస్సు 18 ఏళ్లు నిండి ఉండి, మీ దగ్గర గోల్డ్ ఉంటే చాలు, గోల్డ్ లోన్ పొందవచ్చు. మీ రుణ చరిత్ర, సిబిల్ స్కోర్ వంటివి పెద్దగా అవసరం లేదు. కానీ, కొన్ని కంపెనీలు మాత్రం మంచి సిబిల్ స్కోర్ ఉంటే, వడ్డీ శాతాన్ని కొంత తగ్గిస్తున్నాయి.

Quick processing and timely disbursal: క్షణాల్లో డబ్బు చేతిలోకి

గోల్డ్ లోన్ (gold loan) కి వెళ్తే క్షణాల్లో డబ్బు చేతిలోకి వస్తుంది. ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం పట్టదు. డబ్బు వెంటనే అకౌంట్లోకి వస్తుంది.

Incredible Loan-To-Value ratios: బంగారానికి అత్యధిక విలువతో రుణం

2020లో రిజర్వ్ బ్యాంక్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. మీ గోల్డ్ కు ఆరోజు మార్కెట్లో ఉన్న విలువ (Loan-To-Value ratio) లో 75% నుంచి 90% వరకు రుణంగా ఇవ్వవచ్చని ఆ సర్క్యులర్ లో సూచించింది. దాంతో, ఎక్కువ మొత్తంలో రుణంగా (gold loan) డబ్బు అందుబాటులోకి వస్తుంది. మీ గోల్డ్ విలువకు దాదాపు సమానమైన మొత్తం మీ చేతికి అందుతుంది.

Affordable interest rates: వడ్డీ రేట్లు కూడా తక్కువే

గోల్డ్ లోన్ వడ్డీ రేటు కూడా ఇతర రుణ విధానాలతో పోలిస్తే తక్కువే. పర్సనల్ లోన్స్ వంటి అన్ సెక్యూర్డ్ లోన్స్ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయంగా కూడా అన్ని దేశాలు వడ్డీ రేట్లను గణనీయంగా పెంచుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర గోల్డ్ లోన్ (gold loan) వడ్డీ రేటు సుమారు 8.5% నుంచి ప్రారంభమవుతోంది.

Ease of repayment: రీ పేమెంట్ ఈజీ

గోల్డ్ లోన్ రీపేమెంట్ (gold loan repayment) కూడా చాలా ఈజీ. రీపేమెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. కేవలం వడ్డీ చెల్లించి, అసలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించే సదుపాయం కూడా ఉంది. అంతేకాదు, వడ్డీని (gold loan interest) కూడా నెలవారీగానా? లేక మూడు నెలలకు ఒకసారా? లేక ఆరునెలలకు ఒకసారా? లేక వార్షికంగా చెల్లిస్తారా? అనేది రుణ గ్రహీత నిర్ణయించుకోవచ్చు. అయితే, ఎంచుకున్న విధానం బట్టి వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది. అలాగే, ఒక వేళ ముందే వడ్డీ, అసలు కలిపి చెల్లించాలనుకున్నా.. ఎలాంటి అదనపు చార్జీలు (foreclosure penalties) ఉండవు.

Whats_app_banner