Mutual funds investment : ఇవి తెలియకుండా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. నష్టపోతారు!-key things you should know before investing in mutual funds ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mutual Funds Investment : ఇవి తెలియకుండా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. నష్టపోతారు!

Mutual funds investment : ఇవి తెలియకుండా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. నష్టపోతారు!

Sharath Chitturi HT Telugu
Feb 02, 2024 10:38 AM IST

Mutual funds investment : మ్యూచవల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​మెంట్​కి ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..

ఇవి తెలియకుండా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. నష్టపోతారు!
ఇవి తెలియకుండా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. నష్టపోతారు!

Mutual funds investment : లాంగ్​ రన్​లో మంచి రిటర్నులు సంపాదించుకోవాలంటే స్టాక్​ మార్కెట్​లు బెస్ట్! అయితే.. స్టాక్​ మార్కెట్​లంటే రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. పైగా.. ఎప్పటికప్పుడు ట్రాక్​ చేయాల్సి ఉంటుంది. అంత టైమ్​ లేని వారికి.. 'మ్యూచువల్​ ఫండ్స్​' బెటర్​ ఛాయిస్​ అవుతుంది. అందుకే.. ఇటీవలి కాలంలో మ్యూచువల్​ ఫండ్స్​లో నిధుల ప్రవాహం పెరుగుతంది. భారతీయులు.. ఇన్​వెస్ట్​మెంట్​కి, మ్యూచువల్​ ఫండ్స్​కి ఉన్న విలువను గుర్తించడం ఇందుకు కారణం. అయితే.. మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​మెంట్స్​ని మొదలుపెట్టే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి తెలియకుండా దిగిపోతే.. భవిష్యత్తులో భారీ నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. మ్యూచువల్​ ఫండ్స్​ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూడండి..

మ్యూచువల్​ ఫండ్స్​లో చాలా రకాలు ఉంటాయి..

మార్కెట్​లో ఎన్నో రకాల మ్యూచువల్​ ఫండ్స్​ ఉన్నాయి. అవన్నీ ఒకటి కావు! ఒక్కో మ్యూచువల్​ ఫండ్​కు రిస్క్​ అనేది ఒక్కో విధంగా ఉంటుంది. స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల కన్నా.. మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడుల్లో రిస్క్ అనేది​ కాస్త తక్కువగా ఉంటుందన్నది నిజమే. కానీ మ్యూచువల్​ ఫండ్స్​లో కూడా రిస్క్​ ఉంటుందన్నది గుర్తుపెట్టుకోవాలి.

Mutual funds investment tips : అందువల్ల మ్యూచువల్​ ఫండ్​లో పెట్టుబడి పెట్టే ముందు దాని 'రిస్కోమీటర్'ని కచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. దాని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు.

రెగ్యులర్​ ప్లాన్​ వద్దు.. డైరక్ట్​ ప్లాన్​ ముద్దు..

మ్యూచవల్​ ఫండ్స్​లో రెగ్యూలర్- డైరక్ట్​​ అని రెండు ప్లాన్​లు ఉంటాయి. వీటి మధ్య ఎప్పుడు కన్ఫ్యూజన్​ ఉంటుంది. డైరక్ట్​ ప్లాన్​లో ఎక్స్​పెన్స్​ రేషియో తక్కువగా ఉంటుంది. అందువల్ల రెగ్యూలర్​ ప్లాన్ కన్నా డైరక్ట్​ ప్లాన్​లు అధిక రిటర్నులు ఇస్తూ ఉంటాయి.

best Mutual funds in Telugu : రెగ్యూలర్​ ప్లాన్​లో మదుపర్లకు, ఫండ్​ హౌజ్​కు మధ్యలో బ్రోకర్లు/ ఏజెంట్లు ఉంటారు. మన రిటర్నుల్లో వారికి కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఎక్స్​పెన్స్​ రేషియో ఎక్కువగా ఉంటుంది. డైరక్ట్​ ప్లాన్​లో మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఫలితంగా ఎక్స్​పెన్స్​ రేషియో తక్కువగా ఉంటుంది.

ఇదీ చూడండి:- How to invest 10000 salary : రూ. 10వేల జీతంతో కూడా కోటీశ్వరులు అవ్వొచ్చు.. ఎలా అంటే!

రిటర్నులు.. ఎప్పుడు ఒకేలా ఉండవు..

మ్యూచవల్​ ఫండ్స్​ రిటర్నులను వార్షికంగా లెక్కిస్తారు. ఒక ఏడాది వచ్చిన రిటర్నులు చూసి.. ఇక ప్రతి సారి ఇదే వస్తుందని అనుకోవడం తప్పు.

Mutual funds investment tips for beginners : ఉదాహరణకు ఓ మ్యూచువల్​ ఫండ్​లో ఈ ఏడాది 8శాతం రిటర్నులు వచ్చాయని అనుకుందాము. దీని ప్రకారం.. వచ్చే ఏడాది, ఆ తర్వాత కూడా 8శాతం రిటర్నులే వస్తాయని కాదు. ఇప్పుడు 8శాతం రిటర్నులు ఇచ్చిన మ్యూచువల్​ ఫండ్​.. వచ్చే ఏడాది 10శాతం ఇవ్వొచ్చు. ఆ తర్వాత ఏడాది.. రిటర్నులే ఇవ్వకపోవచ్చు! అందుకే.. మ్యూచువల్​ ఫండ్​ ప్రదర్శన.. ఒక్క ఏడాదిని చూసి లెక్కించకూడదు. 3ఏళ్లు, 5ఏళ్లు, 10ఏళ్ల ప్రదర్శన ఆధారంగా మీ ఇన్​వెస్ట్​మెంట్​ నిర్ణయాలు తీసుకోవాలి.

ఇక ఒకే ఏడాది.. మీ ఇన్​వెస్ట్​మెంట్స్​పై విపరీతంగా రిటర్నులు ఇచ్చేసి.. ఆ తర్వాత పడిపోయే మ్యూచువల్​ ఫండ్స్​ను ఎంచుకోవడం సరైనది కాదు. అదే సమయంలో.. కన్సిస్టెంట్​గా రిటర్నులు ఇచ్చే మ్యూచువల్​ ఫండ్​పై భరోసా పెట్టుకోవచ్చు. ఆ విధంగా.. తక్కువ నష్టాలతో మంచి రిటర్నులు వెనకేసుకునే అవకాశం ఉంటుంది.

ఫండ్​ మేనేజర్​ ముఖ్యం..

మంచి రిట్నరులు రావాలంటే.. ఫండ్​ మేనేజర్​ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది! అందువల్ల ఫండ్​ మేనేజర్​ వివరాలను కూడా తెలుసుకోవాలి. వారి ప్రదర్శన, నిర్ణయాలపైనే మదుపర్లకు వచ్చే రిటర్నులు ఆధారపడి ఉంటాయి.

ఎస్​ఐపీతో సూపర్​ రిటర్నులు..

SIP vs Lumpsum : చివరిగా ఒక్క మాట.. లంప్​సమ్​ కన్నా సిప్​ వెసులబాటును మదుపర్లు ఎంచుకోవడం ఉత్తమం. మార్కెట్​ ఒడుదొడుకుల నుంచి లబ్ధిపొందడంతో పాటు.. సిప్​ అనేది మదుపర్లకు క్రమశిక్షన నేర్పిస్తుంది. డబ్బు సంపాదించాలంటే డిసిప్లిన్​ చాలా ముఖ్యం. సిప్​ చేస్తూ పోతే.. మార్కెట్లు పడినప్పుడు ఎక్కువ యూనిట్​లు లభిస్తాయి. ఫలితంగా యావరేజ్​ అనేది తగ్గుతుంది. మార్కెట్లు పెరిగినప్పుడు.. మంచి రిటర్నులు వస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం