Mutual fund SIP : 10ఏళ్లల్లో రూ. 1కోటి కావాలంటే.. ఎంత 'సిప్'​ చేయాలి?-how much sip should you make to get 1 crore in 10 years via mutual funds ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How Much Sip Should You Make To Get 1 Crore In 10 Years Via Mutual Funds?

Mutual fund SIP : 10ఏళ్లల్లో రూ. 1కోటి కావాలంటే.. ఎంత 'సిప్'​ చేయాలి?

Sharath Chitturi HT Telugu
Mar 01, 2023 11:41 AM IST

Mutual fund SIP : రిటైర్మెంట్​ కార్పస్​ కోసం చాలా మంది మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి చేస్తూ ఉంటారు. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు వస్తుండటం ఇందుకు కారణం. అయితే.. 10ఏళ్లల్లో రూ. 1కోటి కార్పస్​ జనరేట్​ చేయాలంటే.. నెలవారీగా ఎంత సిప్​ చేయాలి, ఎక్కడ సిప్​ చేయాలి వంటి వివరాలు తెలుసుకుందాము..

10ఏళ్లల్లో రూ. 1కోటి కావాలంటే.. ఎంత 'సిప్'​ చేయాలి?
10ఏళ్లల్లో రూ. 1కోటి కావాలంటే.. ఎంత 'సిప్'​ చేయాలి? (MINT_PRINT)

Mutual fund SIP : భవిష్యత్తులో వచ్చే రిటైర్మెంట్​ దశ గురించి చాలా మంది 10-20 ఏళ్ల ముందు నుంచే ప్లాన్​ చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి విషయం. జీవితం 60ఏళ్లు వచ్చే సరికి.. రిటైర్మెంట్​ కార్పస్​ చేతికి వస్తే సంతోషంగా ఉంటుంది. మనం అనుకున్న టార్గెట్​ను రీచ్​ అవ్వడానికి మ్యూచువల్​ ఫండ్స్​ ఉపయోగపడతాయని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. దీర్ఘకాలంలో మ్యూచువల్​ ఫండ్స్​ మంచి రిటర్నులు తెచ్చిపెడతాయని గుర్తుచెస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 10ఏళ్లల్లో రూ. 1 కోటి రిటైర్మెంట్​ కార్పస్​ సంపాదించుకోవాలంటే.. నెలవారీ ఎంత సిప్​ (సిస్టెమాటిక్​ ఇన్​వెస్ట్​మెంట్​ ప్రాసెస్​) చేయాలి? ఎలాంటి మ్యూచువల్​ ఫండ్స్​ను ఎంచుకోవాలి? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

10ఏళ్లు.. రూ. 1కోటి..!

ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ షేర్​ఖాన్​కు చెందిన సూపర్​ ఇన్​వెస్టర్​ హెడ్​, ఎస్​వీపీ గౌతమ్​ కాలియా ప్రకారం.. 10ఏళ్లల్లో రూ. 1 కోటి రిటైర్మెంట్​ కార్పస్​ను సృష్టించాలంటే కొంత రిస్క్​ చేయాలి. ఏడాదికి కనీసం 12శాతం రిటర్నులు ఇచ్చే మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలి. నెలవారీ రూ. 43,500 సిప్​ చేయాల్సి ఉంటుంది. లేదా.. ఇప్పటి నుంచి నెలవారీ రూ. 32వేలు సిప్​ చేస్తూ.. ప్రతి ఏడాది దానిని 10శాతం పెంచుకుంటూ వెళ్లాలి. లేదా ఒకేసారి రూ. 32,20,000లను లంప్​సమ్​లో పెట్టుబడి చేయాలి. ఒకేసారి అంత మొత్తంలో ఇన్​వెస్ట్​మెంట్​ చేయడం కూడా సరైనది కాదు. అందువల్ల నెలవారీ సిప్​ చేయడం ఉత్తమం.

How to invest for retirement : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​ బ్లూచిప్​ ఫండ్​- గ్రోత్​ లార్జ్​ క్యాప్​ కేటగిరీలో 30శాతం, ఎస్​బీఐ లార్జ్​ అండ్​ మిడ్​క్యాప్​ ఫండ్​- గ్రోత్​- లార్జ్​ అండ్​ మిడ్​ కేటగిరీలో 15శాతం, మిరాయ్​ అసెట్​ మిడ్​క్యాప్​ ఫండ్​- రెగ్యులర్​ గ్రోత్​ లేదా కొటాక్​ స్మాల్​ క్యాప్​ ఫండ్​ గ్రోత్​లో 25శాతం అలాకేషన్​ చేస్తే టార్గెట్​ రీచ్​ అవుతారు.

అయితే.. దీర్ఘకాల ఇన్​వెస్ట్​మెంట్స్​ విషయంలో సహనం చాలా అవసరం. ఒక్కోసారి మార్గం మధ్యలో ఉన్నప్పుడు మనం అనుకున్న ఫలితాలు కనిపించకపోవచ్చు. అలాంటప్పుడే.. స్ట్రాటజీపై నమ్మకం ఉంచి, ముందుకెళ్లాలి. అప్పుడే దీర్ఘకాలంలో మనం అనుకున్న టార్గెట్​ రీచ్​ అవుతాము.

వేరే ఆప్షన్ ఉందా?

Retirement corpus investment mutual funds : నెలవారీ రూ. 40-45వేలు ఇన్​వెస్ట్​ చేయడం కుదరకపోతే.. కనీసం రూ. 20వేలతో సిప్​ను ప్రారంభించాలి. ప్రతియేటా దానిని కనీసం రూ. 6వేల పెంచుకుంటూ వెళ్లాలి. ఈ లెక్కన, 10ఏళ్లల్లో 13శాతం సీఏజీఆర్​తో రిటర్నులు వస్తే.. రూ. 1కోటి కార్పస్​ జనరేట్​ అవుతుంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​ బ్లూచిప్​ ఈక్విటీ ఫండ్​, హెచ్​డీఎఫ్​సీ స్మాల్​ క్యాప్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేయవచ్చని.. ఈజీపే ఫౌండర్​ సామ్స్​ తబ్రేజ్​ చెబుతున్నారు.

(గమనిక:- రికమెండేషన్లు నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు సంబంధం లేదు. మ్యూచువల్​ ఫండ్స్​లోనూ రిస్క్​ ఉంటుందని గ్రహించి, మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.)

WhatsApp channel