Best ELSS mutual funds : బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్- 5ఏళ్లల్లో 20శాతం రిటర్నులు!
ELSS mutual funds 2024 : గత 5ఏళ్లల్లో 20శాతం కన్నా అధికంగా రిటర్నులు ఇచ్చిన టాప్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్‌ని మీకోసం మేము రూపొందించాము. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టర్లు ఆ స్కీమ్‌కి సంబంధించిన పాత రిటర్నులను చూసి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. ఇది సరైన పెట్టుబడి నిర్ణయం కానప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లలో ఇది ఇప్పటికీ చాలా సాధారణం ఉంది. ఇక గత 5 సంవత్సరాల్లో 20 శాతానికి పైగా రాబడిని ఇచ్చిన ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి..
ఈ నేపథ్యంలో రిటర్నుల రేటును దృష్టిలో ఉంచుకుని గత ఏడాది బెంచ్‌మార్క్ సూచీలను పరిశీలిస్తే.. 2023 క్యాలెండర్ ఇయర్లో నిఫ్టీ50 20 శాతం, సెన్సెక్స్ 18.74 శాతం లాభపడ్డాయి.
ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్..
ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ 2005 ప్రకారం.. ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) స్టాక్స్‌లో కనీసం 80 శాతం పెట్టుబడి పెడతాయి. ఈ పథకాలకు మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. (ఇది అన్ని ఇతర పన్ను ఆదా ఆప్షన్స్ కంటే తక్కువ).
పీపీఎఫ్, ఎల్ఐసీ, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) సహా ఇతర పెట్టుబడి ఆప్షన్స్ మాదిరిగానే ఈ పథకాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ .1,50,000 వరకు మినహాయింపు పొందడానికి అర్హులు.
ఈఎల్ఎస్ఎస్ పథకాల గత ఐదేళ్ల రిటర్నులు ఇక్కడ చూడండి..
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ | 5ఏళ్ల రిటర్నులు (%) |
Bandhan ELSS Tax Saver Fund | 22.50 |
Bank of India ELSS Tax Saver Fund | 28.69 |
Canara Robeco ELSS Tax Saver | 21.31 |
DSP ELSS Tax Saver Fund | 22.97 |
Franklin India ELSS Tax Saver Fund | 20.78 |
HDFC ELSS Tax Saver Fund | 21.00 |
JM ELSS Tax Saver Fund | 24.08 |
Kotak ELSS Tax Saver Fund | 21.62 |
Mahindra Manulife ELSS Tax Saver Fund | 20.17 |
Mirae Asset ELSS Tax Saver Fund | 21.61 |
Motilal Oswal ELSS Tax Saver Fund | 24.01 |
SBI Long Term Equity Fund | 25.07 |
Union ELSS Tax Saver Fund | 21.41 |
(సోర్స్: యాంఫీ; జూలై 12, 2024 నాటికి సంబంధించిన డేటా)
పై పట్టికలో మనం చూసిట్లుగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అత్యధికంగా 28.69 శాతం రిటర్నులు ఇవ్వగా, ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 25.07 శాతం రాబడిని ఇచ్చింది.
జేఎం ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (24.08%), మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (24.01%) 24 శాతం కంటే ఎక్కువ రిటర్నులు ఇచ్చిన ఇతర మ్యూచువల్ ఫండ్ స్కీమ్ల్.
ఇన్వెస్టర్లు ఒక ఫండ్ పాత రిటర్నులే కాకుండా ఫండ్ హౌస్ ప్రతిష్ట, భవిష్యత్తు రాబడులను ప్రభావితం చేసే స్థూల ఆర్థిక కారకాలు, పథకానికి చెందిన రంగం, దాని భవిష్యత్తు అంచనాలు వంటి ఇతర అంశాలను అంచనా వేయడం గమనార్హం.
(గమనిక: ఈ కథ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌తో మీరు మాట్లాడాల్సి ఉంటుంది.)
సంబంధిత కథనం