ITR filing: పన్ను చెల్లింపుదారుల కోసం, కొత్త ఇ-పే టాక్స్ సేవలను అందించడానికి కొన్ని బ్యాంక్ లకు అనుమతి లభించింది. ఆ అధీకృత బ్యాంక్ ల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపులు జరపవచ్చు. వీటిలో చలాన్ (CRN) ప్రొడక్షన్, పేమెంట్ అండ్ పేమెంట్ హిస్టరీ ట్రాకింగ్ మొదలైనవి ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్నును చెల్లించడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, బ్యాంక్ కౌంటర్ వద్ద చెల్లింపు... మొదలైనవి.
ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ ప్రకారం, ఈ-పే ట్యాక్స్ సర్వీస్ లు అందుబాటులో ఉన్న అధీకృత బ్యాంకుల జాబితా ఇదీ:
1. యాక్సిస్ బ్యాంక్
2. బంధన్ బ్యాంక్
3. బ్యాంక్ ఆఫ్ బరోడా
4. బ్యాంక్ ఆఫ్ ఇండియా
5. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
6. కెనరా బ్యాంక్
7. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8. సిటీ యూనియన్ బ్యాంక్
9. డీసీబీ బ్యాంక్
10. ఫెడరల్ బ్యాంక్
11. హెచ్డీఎఫ్సీ బ్యాంక్
12. ఐసీఐసీఐ బ్యాంక్
13. ఐడీబీఐ బ్యాంక్
14. ఇండియన్ బ్యాంక్
15. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
16. ఇండస్ ఇండ్ బ్యాంక్
17. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్
18. కరూర్ వైశ్యా బ్యాంక్
19. కోటక్ మహీంద్రా బ్యాంక్
20. కర్ణాటక బ్యాంక్
21. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
22. పంజాబ్ నేషనల్ బ్యాంక్
23. ఆర్బీఎల్ బ్యాంక్
24. సౌత్ ఇండియన్ బ్యాంక్
25. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
26. యూకో బ్యాంక్
27. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
28. ధనలక్ష్మి బ్యాంకు.