Tax saving mutual funds : ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ టాప్ 10 ఇవిగో-top performing tax saving elss mutual funds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Top Performing Tax Saving Elss Mutual Funds

Tax saving mutual funds : ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ టాప్ 10 ఇవిగో

HT Telugu Desk HT Telugu
Jun 10, 2022 03:48 PM IST

ELSS Mutual Funds : ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌ ఎంచుకోవాల్సి వస్తే చాలాసార్లు మనం స్నేహితుల సాయం కోరుతాం. అయితే గడిచిన మూడేళ్లు లేదా ఐదేళ్ల పర్‌ఫార్మెన్స్ చూసి ఆయా టాక్స్ సేవింగ్స్‌లో బెస్ట్ స్కీమ్ ఏదో బేరీజు వేసుకుని మనం కూడా సేవింగ్స్ చేయడం మొదలుపెట్టొచ్చు.

ఉద్యోగులకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చే ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
ఉద్యోగులకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చే ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ (ప్రతీకాత్మక చిత్రం) (Bloomberg)

ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్స్ స్కీమ్ అని అర్థం. పేరులో ఉన్నట్టుగానే ఈ ఫండ్స్ ఈక్విటీలతో అనుసంధానమై ఉంటాయి. అంటే మనం చేసే సేవింగ్స్‌ను ఫండ్ మేనేజర్లు షేర్లలో పెట్టుబడులు పెడతారు.

సెక్షన్ 80 సీ పరిధిలో ఒక ఏడాదిలో గరిష్టంగా రూ. 1,50,000 ఇన్‌కమ్ టాక్స్ నుంచి మినహాయింపు కోరవచ్చు. ఈఎల్ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇంతే మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ సెక్షన్ పరిధిలో పన్ను ఆదా చేసుకోవచ్చు.

ఈ మొత్తాన్ని నెలనెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతిలోగానీ, ఏకమొత్తంలో గానీ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడు దానిలో సేవింగ్స్ చేసినా.. ఆ సమయం నుంచి మూడేళ్ల పీరియడ్ వరకు లాకిన్ ఉంటుంది. అంటే మూడేళ్ల వరకు మనం వాటిని వెనక్కి తీసుకోలేం.

టాప్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి?

మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఇచ్చిన లాభాల ఆధారంగా ఈ పట్టిక రూపొందింది. ఆయా లాభ శాతాల ఆధారంగా బేరీజు వేసి ఇచ్చిన ర్యాంకులు ఇవి. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా మంచి లాభాలు అందిస్తాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో పెట్టుబడులు లాకిన్‌లో ఉంటున్నందున ఫండ్ మేనేజర్లకు తగినంత వెసులుబాటు ఉండి లాభాలు తెచ్చి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కింద ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఐదేళ్ల వ్యవధిలో దాదాపు 14 శాతం నుంచి 22 శాతం మధ్య లాభాలు పంచాయి. 

క్రమసంఖ్యఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్3 ఏళ్ల లాభం(శాతంలో)ర్యాంకు5 ఏళ్ల లాభం (శాతం)ర్యాంకు
1క్వాంట్ టాక్స్ ప్లాన్ గ్రోత్ డైరెక్ట్33.93121.971
2క్వాంట్ టాక్స్ ప్లాన్ గ్రోత్ 31.40220.372
3మిరే అసెట్ టాక్స్ సేవర్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్18.73615.983
4కెనెరా రొబెకో ఈక్విటీ టాక్స్ సేవర్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్17.60815.174
5బీఓఐ ఆక్సా టాక్స్ అడ్వంటేజ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్21.14915.155
6బీఓఐ ఆక్సా టాక్స్ అడ్వంటేజ్ ఎకో గ్రోత్20.431314.536
7మిరే అసెట్ టాక్స్ సేవర్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్17.031014.387
8కెనెరా రొబెకో ఈక్విటీ టాక్స్ సేవర్ గ్రోత్16.251414.008
9ఐడీఎఫ్‌సీ టాక్స్ అడ్వంటేజ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్18.17713.859
10బీఓఐ ఆక్సా టాక్స్ అడ్వంటేజ్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్19.84513.8310

ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి?

చాలా మంది వేతన జీవులు టాక్స్ కట్ అవుతుందన్న భయంతో ఆర్థిక సంవత్సరం చివరలో హడావుడిగా మార్చి నెలలో.. అది కూడా నెలాఖరులో కడుతుంటారు. ఒకవేళ ఆ సమయంలో మార్కెట్లు బాగా పీక్ లెవల్‌లో ఉంటే మీ ఫండ్స్ ఇచ్చే లాభాలు తక్కువగా ఉండొచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏకమొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తాననుకుంటే మార్కెట్లు పతనమైనప్పుడు చేసుకుంటే మేలు.

వీటన్నింటికంటే సులభమైన మార్గం నెలనెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా సేవింగ్స్ చేస్తే ఇంకా ప్రయోజనం ఉంటుంది. అది కూడా ఏప్రిల్ నుంచే మొదలు పెడితే ఇంకా మంచిది. మీరు సపోజ్ నెలకు రూ. 5 వేలు సేవింగ్స్ చేద్దామనుకున్నారనుకోండి. మార్కెట్ భారీగా పెరిగినప్పుడు మీ వాయిదా చెల్లిస్తే మీకు తక్కువ మొత్తంలో యూనిట్లు రావొచ్చు. ఒకవేళ మార్కెట్లు పడిపోయినప్పుడు మీరు చెల్లించాల్సిన వాయిదా వస్తే.. మీకు ఎక్కువ యూనిట్లు రావొచ్చు. అలా మీరు ఏకమొత్తంలో పెట్టడం కంటే సిప్ ద్వారా పెట్టడం వల్ల లాభాలు ఎక్కువగా ఆర్జించే అవకాశం ఉంటుంది.

(నోట్: ఈ పట్టిక, కథనం మీ అవగాహన కోసం మాత్రమే. ఈక్విటీ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..)

IPL_Entry_Point

సంబంధిత కథనం