Small cap mutual funds : మదుపర్ల చూపంతా 'స్మాల్​ క్యాప్'​ ఫండ్స్​పైనే! కారణం ఏంటి?-why mutual fund investors are choosing small caps over large and mid cap funds ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Small Cap Mutual Funds : మదుపర్ల చూపంతా 'స్మాల్​ క్యాప్'​ ఫండ్స్​పైనే! కారణం ఏంటి?

Small cap mutual funds : మదుపర్ల చూపంతా 'స్మాల్​ క్యాప్'​ ఫండ్స్​పైనే! కారణం ఏంటి?

Sharath Chitturi HT Telugu
Aug 12, 2023 11:20 AM IST

Small cap mutual funds returns : స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​పై మదుపర్ల ఫోకస్​ పెరిగింది! లార్జ్​ క్యాప్​, మిడ్​ క్యాప్​తో పోల్చుకుంటే, ఇక్కడ ఇన్​ఫ్లో పెరిగింది.

మదుపర్ల చూపంతా స్మాల్​ క్యాప్​ ఫండ్స్​పైనే! కారణం ఏంటి?
మదుపర్ల చూపంతా స్మాల్​ క్యాప్​ ఫండ్స్​పైనే! కారణం ఏంటి?

Small cap mutual funds returns : ఈ మధ్య కాలంలో స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ అద్భుతమైన రిటర్నులు ఇచ్చాయి. ఈ సెక్షన్​లో సంపద వృద్ధి అద్భుతంగా జరుగుతోంది. మదుపర్లు కూడా ఇందులో ఇన్​వెస్ట్​ చేసేందుకు ముందుకొస్తున్నారు. దీర్ఘకాలంలో స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ మంచి రిటర్నులు ఇస్తాయని పలువురు స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు. లార్జ్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ కన్నా ఈ తరహా మ్యూచువల్​ ఫండ్స్​ వేగంగా వృద్ధి చెందడం ఇందుకు కారణం అని అంటున్నారు.

"చిన్న వ్యాపారాలు ఉండి, అవి వేగంగా వృద్ధి చెందగలవు అనుకునే సంస్థల్లో ఈ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ పెట్టుబడి పెడుతుంటాయి. వ్యాపారం వృద్ధి చెందే కొద్ది, ఇన్​వెస్టర్స్​కు లాభాలు కూడా పెరుగుతాయి. వెల్త్​ క్రియేషన్​ అన్నది లార్జ్​ క్యాప్​ కన్నా, స్మాల్​ క్యాప్​లోనే వేగంగా జరుగుతుంది," అని ఫిన్​డాక్​ ఫౌండర్​ హేమంత్​ సూద్​ తెలిపారు.

"స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో డైవర్సిఫికేషన్​ ఉంటుంది. లార్జ్​ క్యాప్​ సంస్థలు తక్కువ ప్రదర్శన చేసినప్పుడు, ఈ స్మాల్​ క్యాప్​ ఫండ్స్​ వల్ల ఓవరాల్​ పోర్ట్​ఫోలియో వృద్ధిచెందుతుంది. ఈ డైవర్సిఫికేషన్​తోనే మన సంపద వేగంగా రెట్టింపు అవుతుంది," అని హేమంత్​ సూద్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:- Best small cap mutual funds : బెస్ట్​ స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ లిస్ట్​ ఇదే..

నిపుణుల మాటలకు తగ్గట్టుగానే మార్కెట్​లో పరిస్థితులు కనిపిస్తున్నాయి! 2023 జులైలో.. లార్జ్​ క్యాప్​, మిడ్​ క్యాప్​తో పోల్చుకుంటే స్మాల్​ క్యాప్​లోనే ఇన్​వెస్ట్​మెంట్స్​ ఎక్కువగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని అసోసియేషన్​ ఆఫ్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇన్​ ఇండియా (ఏఎంఎఫ్​ఐ) తెలిపింది. జులైలోనే కాదు, గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కనిపిస్తోందని వివరించింది. లార్జ్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ను స్మాల్​ క్యాప్​ చాలా మార్జిన్​తో బీట్​ చేసిందని చెప్పింది.

2023 best Small cap mutual funds : "మార్కెట్​ క్యాపిటల్​ పరంగా 251-500 స్థానాల్లో ఉన్న కంపెనీలు ఈ స్మాల్​ క్యాప్​లో ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 251వ సంస్థ క్యాపిటల్​ చాలా చిన్నది కాదు. దానికి రూ. 22000కోట్ల మారకెట్​ క్యాపిటల్​ ఉంది. 500వ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 8500 కోట్లు. ఈ మధ్యలో ఉన్న చాలా కంపెనీలు వేగంగా వృద్ధిచెందుతున్నాయి," అని నిపుణులు చెబుతున్నారు.

సిప్​తో రికార్డు స్థాయి ఇన్​వెస్ట్​మెంట్స్​..

సిప్​ ద్వారా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేస్తున్న నగదు సంఖ్య ప్రతి నెలా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. జులైలో రూ. 15,242.7 కోట్లు సిప్​ ద్వారా అన్ని సెక్టార్లలోని మ్యూచువల్​ ఫండ్స్​లోకి వచ్చాయి. ప్రజల్లో స్టాక్​ మార్కెటలపై పెరుగుతున్న అవగాహనకు ఇది చక్కటి ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. స్టాక్​ మార్కెట్​ అన్నది రిస్క్​తో కూడుకున్నది. స్మాల్​ క్యాప్​ ఫండ్స్​లో అంతకుమించి రిస్క్​లు ఉంటాయన్న విషయాన్ని మదుపర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం