Bigg Boss Telugu Elimination: ఈవారం బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఎలిమినేట్.. మిడ్ వీక్‌లో మరోకరు ఔట్-bigg boss 7 telugu 14th week shobha shetty elimination and prince yawar in mid week elimination ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu Elimination: ఈవారం బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఎలిమినేట్.. మిడ్ వీక్‌లో మరోకరు ఔట్

Bigg Boss Telugu Elimination: ఈవారం బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఎలిమినేట్.. మిడ్ వీక్‌లో మరోకరు ఔట్

Sanjiv Kumar HT Telugu
Dec 09, 2023 06:05 AM IST

Bigg Boss 7 Telugu Winner Voting: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే టైటిల్ విన్నర్ ఎవరనేది తేల్చేందుకు ఓటింగ్ పోల్స్ స్టార్ట్ చేశారు. ఈ పోలింగ్‌లో తక్కువ ఓట్స్ కారణంగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ శోభా శెట్టి ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈవారం బిగ్ బాస్ ముద్దిబిడ్డ ఎలిమినేట్.. మిడ్ వీక్‌లో మరోకరు హౌజ్ నుంచి ఔట్
ఈవారం బిగ్ బాస్ ముద్దిబిడ్డ ఎలిమినేట్.. మిడ్ వీక్‌లో మరోకరు హౌజ్ నుంచి ఔట్

Bigg Boss 7 Telugu 14th Week Elimination: సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. డిసెంబర్ 15 వరకు టైటిల్ విన్నర్ ఓటింగ్ పోల్స్ ఉంచుతారు. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరనేది ప్రకటించనున్నారు. ఇక బిగ్ బాస్ 7 తెలుగు 14వ వారం నామినేషన్స్‌లో అర్జున్ అంబటి తప్పా మిగతా ఆరుగురు నామినేట్ అయ్యారు.

yearly horoscope entry point

ఈసారి ఎలిమినేషన్‌ కోసం కాకుండా టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ పోల్స్ పెట్టారు. అందులో ఎవరికీ తక్కువగా ఓటింగ్ వస్తే వారు ఎలిమినేట్ అవుతారు. ఈ 14వ వారం ఒకరు, 15వ వారంలో మధ్యలో (మిడ్ వీక్ ఎలిమినేషన్) మరొకరిని ఎలిమినేట్ చేస్తారు. ఇక బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ రేసులో నలుగురు గట్టిగా పోటీ పడుతున్నారు.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 41.39 శాతం ఓట్లతో మొదటి ప్లేసులో ఉంటే.. 17.68 శాతంతో శివాజీ రెండో స్థానం, 16.84 శాతంతో ప్రిన్స్ యావర్ మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఇక అమర్ దీప్ 16.18 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాడు. యావర్, అమర్ స్థానాలు మారుతూ వస్తున్నాయి. వీరిలో ఎక్కువగా పల్లవి ప్రశాంత్‌కు టైటిల్ విన్నర్ కొట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇక 3.58 శాతం ఓట్లతో అర్జున్ అంబటి ఐదో స్థానం, 2.77 శాతంతో ప్రియాంక ఆరో స్థానం, 1.55 శాతం ఓట్లతో శోభా శెట్టి ఏడో స్థానంలో ఉన్నారు. బిగ్ బాస్ తన ముద్దుబిడ్డ శోభా శెట్టిని ఎన్నోసార్లు ఎలిమినేషన్ నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. కానీ, ఈసారి మాత్రం కచ్చితంగా శోభా శెట్టి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

అలాగే 15వ వారం మిడ్ వీక్‌లో టాప్ ఓట్లతో ముందంజలో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ ప్రిన్స్ యావర్ కూడా ఎలిమినేట్ కానున్నాడను సమాచారం. హౌజ్‌లో బిగ్ బాస్ జర్నీ వీడియో చూపించిన తర్వాత ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ కానున్నాడట. ప్రిన్స్ యావర్ ఎలిమినేషన్ షూటింగ్‌ను బుధవారం చేసి గురువారం నాడు తెలుగు ప్రేక్షకులకు బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. ఇలా ఈవారం రెండు ఎలిమినేషన్స్ జరగనున్నాయి.

Whats_app_banner