Double Rajayogam:డబుల్ జాక్ పాట్! ఒకేసారి రెండు రాజయోగాల కలయిక.. ఈ రాశుల వారిపై కాసుల వర్షం-gajakesari yogam and budhaditya yogam meets at one point give huge money and luck to these zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Double Rajayogam:డబుల్ జాక్ పాట్! ఒకేసారి రెండు రాజయోగాల కలయిక.. ఈ రాశుల వారిపై కాసుల వర్షం

Double Rajayogam:డబుల్ జాక్ పాట్! ఒకేసారి రెండు రాజయోగాల కలయిక.. ఈ రాశుల వారిపై కాసుల వర్షం

Ramya Sri Marka HT Telugu
Dec 12, 2024 12:41 PM IST

Double Rajayogam: గ్రహాల కదలికల్లో మార్పుల కారణంగా కొన్ని సార్లు రాజయోగాలు ఏర్పడతాయి.ఇవి కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఈ సారి ఒకేసారి రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి రెండింతల శుభఫలితాలు కలుగుతాయి.

ఒకేసారి రెండు రాజయోగాల కలయిక.. ఈ రాశుల వారిపై కాసుల వర్షం
ఒకేసారి రెండు రాజయోగాల కలయిక.. ఈ రాశుల వారిపై కాసుల వర్షం (Pixabay)

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికల్లో మార్పుల కారణంగా రకరకాల యోగాలు ఏర్పడతాయి. గ్రహాల కలయిక, యుతి వంటి కారణాల వల్ల ఈ యోగాలు ఏర్పడతాయి. ఇవి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం ఈ సారి రెండు యోగాలు ఒకేసారి ఏర్పడనున్నాయి. ఈ యోగాలు ఒకదాన్ని ఒకటి వీక్షించుకుంటున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి రెండింతల అదృష్టం కలుగనుంది. ఆ యోగాలు ఏంటో.. వాటి వల్ల కలిసొచ్చే రాశులేవో తెలుసుకుందాం..

రెండు యోగాలు ఎలా ఏర్పడుతున్నాయంటే..

జ్యోతిష్య గణన లెక్కల ప్రకారం.. డిసెంబర్ 14తేదీన వృషభ రాశిలో సంచరిస్తున్న చంద్రుడు అదే రాశిలో సంచరిస్తున్న గురు గ్రహంతో కలవనున్నాడు. చంద్రుడు, గురు కలయిక కారణంగా గజకేసరి యోగం ఏర్పుడుతుంది. అప్పటికే సూర్యుడు, బుధుడు కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడి ఉంటుంది. గజకేసరి యోగం దానికి సప్తమ స్థానంలో అప్పటికే ఏర్పడి ఉన్న బుధాదిత్య యోగాన్ని 14, 15, 16 తేదీల్లో వీక్షిస్తుంది. ఇలా రెండు యోగాలు ఒకేసారి ఏర్పడి ఒకదాన్ని ఒకటి వీక్షించుకోనున్నాయి. రెండు యోగాలు ఒకేసారి ఏర్పడటం చాలా అరుదుగా జరిగేది, అదృష్టాన్ని తెచ్చిపెట్టేది. ఇది కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది.

రెండు రాజయోగాలతో లాభ పడుతున్న రాశులు ఏవంటే..

వృషభ రాశి:

వృషభ రాశి వారిపై రెండు రాజయోగాల ప్రభావం పడుతుంది. ఇది వీరికి శుభప్రదంగా మారుతుంది. ఫలితంగా ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. తలపెట్టిన ప్రతి పనిలో లాభాలే కనిపిస్తాయి. ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ప్రమోషన్స్‌తో పాటు జీతాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు పెరుగుతాయి.

కర్కాటక రాశి:

రెండు యోగాల కారణంగా కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో విపరీతమైన రాజయోగం కలుగుతుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులకు ఈ సమయంలో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు భారీగా లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఆశించిన ఉద్యోగం దోరుకుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి:

సింహ రాశి వారిపై రెండు యోగాల కారణంగా అత్యంత శుభ పరిణామాలు ఎదురవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి మంచి రోజులు ఉండనున్నాయి.ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు భారీగా వృద్ధి చెందుతాయి. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.

వృశ్చిక రాశి:

ఈ రాశిలో ఇప్పటికే ఏర్పడి ఉన్న బుధాదిత్య యోగాన్ని గజకేసరి యోగం వీక్షిస్తుంది. ఫలితంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు అదృష్టం బాగా కలిసొస్తుంది. సమాజంతో విలువ, గుర్తింపు పెరుగుతాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రాభల్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాణిస్తారు.ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

మకర రాశి:

మకర రాశి వారికి ఈ రాజయోగాల కారణంగా ఏ పనులు చేపట్టినా విజయవంతమై తీరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది.

కుంభ రాశి:

రెండు రాజయోగాల కలయిక కారణంగా శుభ ఫలితాలు లభించనున్నాయి. వ్యక్తిగత, ఆస్తి సంబంధిత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner