Sun Transit: ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం.. కష్టాలు తీరుతాయి, పట్టిందల్లా బంగారమే-sun transit 2024 makes these rasis happy and problems will goes off can stay with wealth and health ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం.. కష్టాలు తీరుతాయి, పట్టిందల్లా బంగారమే

Sun Transit: ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం.. కష్టాలు తీరుతాయి, పట్టిందల్లా బంగారమే

Peddinti Sravya HT Telugu
Dec 12, 2024 11:00 AM IST

Sun Transit: సూర్యుని మార్పు ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యం. డిసెంబర్ 15 2024న ధనస్సురాశిలో సూర్యుని సంచారం జరగబోతోంది. అప్పటి నుంచి కర్మలు కూడా మొదలవుతాయి. సూర్యుని మార్పు వలన మీకు ఎలాంటి ప్రభావం పడుతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Sun Transit: ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం.. ఆహా కష్టాలు తీరుతాయి
Sun Transit: ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం.. ఆహా కష్టాలు తీరుతాయి

మనకి మొత్తం 12 రాశులు. 12 రాశులు ఆధారంగా మనం భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. సూర్య గోచారం 12 రాశులను కూడా ప్రభావితం చేయబోతోంది. సూర్యుడు గ్రహాలకు అధిపతి. సూర్యుని మార్పు ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యం. డిసెంబర్ 15 2024న ధనస్సురాశిలో సూర్యుని సంచారం జరగబోతోంది. అప్పటి నుంచి కర్మలు కూడా మొదలవుతాయి. సూర్యుని మార్పు వలన మీకు ఎలాంటి ప్రభావం పడుతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

yearly horoscope entry point

మేష రాశి:

సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించేటప్పుడు, మేష రాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడడానికి అవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత శుభ ఘడియలు.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి కూడా మంచే జరుగుతుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఈ సమయంలో కొత్త ప్రణాళికలను రూపొందించండి.

మిధున రాశి:

ఉద్యోగం లేదా వ్యాపారం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. ఈ సమయంలో కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. మంచి అవకాశాలని అందుకుంటారు.

కర్కాటక రాశి:

ఈ సమయంలో శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఈ సమయంలో మీరు పాల్గొంటారు.

సింహ రాశి:

సూర్యుని సంచారం మీకు సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. పిల్లల పరిస్థితి కూడా బాగుంటుంది. కొంచెం కోపం పెరగొచ్చు చూసుకోండి.

కన్య రాశి:

కుటుంబంలో కొంచెం టెన్షన్ ఉంటుంది. కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మంచిది. అలాగే ఆలోచించి నిర్ణయాలని తీసుకోండి.

తులా రాశి:

తులా రాశి వాళ్లకు ధైర్యం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి రాబడి వస్తుంది.

వృశ్చిక రాశి:

సూర్యుడులో మార్పు వలన కాస్త మాటలు కఠినంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి మీకు ప్రయోజనాలు అందుతాయి. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా విజయాలని అందుకుంటారు.

ధనస్సు రాశి:

సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మీకు డబ్బులు కూడా బాగా అందుతాయి. సంపాదన పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఉంటుంది.

మకర రాశి:

మకర రాశి వాళ్ళు పొలిటికల్ వివాదాలకు దూరంగా ఉండాలి. ఇటువంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉంటేనే మీకు మంచిది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుంభ రాశి:

సూర్యుని మార్పు వలన మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. త్వరలో మంచి గడియలు రాబోతున్నాయి.

మీన రాశి:

సూర్యుని మార్పు వలన మీన రాశి వారికి కూడా మంచి జరగబోతోంది. వ్యాపారులకి కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం